1/70 చట్టాన్ని అమలు చేయాలి
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:08 AM
ఆదివాసీల రక్షణకు ఉద్దేశించిన 1/70 చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి, జేఏసీ జిల్లా అధ్యక్షుడు బిడ్డిక శ్రీను డిమాండ్ చేశారు.
పాలకొండ, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీల రక్షణకు ఉద్దేశించిన 1/70 చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి, జేఏసీ జిల్లా అధ్యక్షుడు బిడ్డిక శ్రీను డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీం కోర్టులో ఈ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన కేసులో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇంప్లీట్ పిటిషన్ వేయాలన్నారు. 1/70 చట్టం శ్రీకాకుళం గిరిజన సాయుధ పోరాట ఫలితమేనన్నారు. గిరిజనులు భూములు, అడవులు, జలాలను రక్షించేందుకు ఈ చట్టం కీలకమన్నారు. సమావేశంలో ఆదివాసీ జేఏసీ నాయకులు బిడ్డిక ఉమామహేశ్వరరావు, తిరుమలరావు, సవర సింహాచలం, మిన్నారావు, సవర వెంకటరమణ, సవర పేతురు, కొండదొర వినోద్, యోగేష్, శ్రీకాంత్, భాస్కర్, కాంతారావు, గోపి తదితరులు పాల్గొన్నారు.