పీజీఆర్‌ఎస్‌కు 164 వినతులు
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:29 AM
కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వివిధ సమస్యలపై 164 వినతులు వచ్చాయి.
విజయనగరం కలెక్టరేట్, జనవరి 12(ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వివిధ సమస్యలపై 164 వినతులు వచ్చాయి. ఇందులో రెవెన్యూ క్లినిక్‌కు సంబంధించి 110 వినతులు(భూ సమస్యలపై) వచ్చాయి. డీఆర్‌డీఏ 13, పంచాయతీరాజ్ 9, మున్సిపల్ శాఖకు 5, హౌసింగ్ 1, జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు 1, గ్రామ సచివాలయం 7, విద్యా శాఖ 7, ఇతర శాఖలకు సంబంధించి 11 వినతు లు వచ్చాయి. వీటిని డీఆర్వో మురళి, డిప్యూటీ కలెక్టర్లు వినతులు స్వీకరించారు.
కల్లుగీత కార్మికుల ఆధ్వ ర్యంలో నడుస్తున్న మద్యం దుకాణానికి విద్యుత్ సరఫ రా కల్పించాలంటూ సంతకవిటి మండలానికి చెందిన లైసెన్సుదారు గొడ్డు పావని కోరారు. ఈ మేరకు సోమ వారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వినతి పత్రం అందజేశారు. ఆమె వెంట కొల్లి ఆప్పారావు, చుక్క గణేష్, కోటరావు, కుమార్ ఉన్నారు.