Share News

చిల్లంగి నెపంతో వ్యక్తి హత్య కేసులో 16 మంది అరెస్టు

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:46 PM

చిల్లంగి ఉందన్న నెపంతో ఒక వ్యక్తిని హత్య చేసి దహనం చేసిన ఘటనలో 16 మంది నిందితులను అరెస్టు చేశారు.

చిల్లంగి నెపంతో వ్యక్తి హత్య కేసులో 16 మంది అరెస్టు

బెలగాం, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): చిల్లంగి ఉందన్న నెపంతో ఒక వ్యక్తిని హత్య చేసి దహనం చేసిన ఘటనలో 16 మంది నిందితులను అరెస్టు చేశారు. పార్వ తీపురం మండలంలో కలకలం రేపిన ఈ ఘటనపై మంగళవారం స్థానిక సబ్‌ డివిజన్‌ పోలీస్‌ కార్యాలయంలో ఏఎస్పీ మనీషారెడ్డి విలేఖర్ల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. వెలగవలసకు చెందిన తాడంగి రమేష్‌ (30)కు చిల్లంగి ఉందన్న నెపంతో సోమవారం రాత్రి కొంతమంది గ్రామస్థులు ఆయన్ని ఇంటి నుంచి లాక్కెళ్లి తీవ్రంగా కొట్టి గాయ పర్చారు. ఈ క్రమంలో రమేష్‌ మృతి చెందిన తర్వాత దహనం చేశారు. దీనిపై ఆయన సోదరుడు తాడంగి శ్రీధర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పార్వతీపురం రూరల్‌ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న వారు దహనమవుతున్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మూ డు టీములు ఈ కేసును దర్యాప్తు చేశాయి. వివిధ కోణాల్లో విచారించిన అనం తరం ఈ నేరంలో పాలుపంచుకున్న 16 మంది నిందితులను అరెస్టు చేశారు. అరెస్ట్‌ అయిన వారిలో తాడంగి తిరుపతి, శ్రీదరపు పూయి, సూరన్న, తాడంగి సింగూరు, కృష్ణ, కర్తక చిన్నప్ప, కొండగొర్రె చిన్నప్ప, మల్లిక, వెంకయ్య, మిల్లిక వీర య్య, కడక సంగయ్య, తాడంగి ప్రకాష్‌, మిల్లిక ప్రసాద్‌, కొండగొర్రె గాంధీ, కర్రకు గుంపు, కామేష్‌, ముత్యాలు, కడక చామంతి, సుజాత, రోజా, సున్నమ్మ తదిత రులున్నారు. కాగా మరికొంతమందిని త్వరలో అరెస్టు చేస్తామని ఏఎస్పీ తెలిపా రు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఆమె వెంట రూరల్‌ సీఐ రంగనాథ్‌, ఎస్‌ఐలు రాజేష్‌, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 11:46 PM