Crop Insurance 15,765 మంది రైతులకు పంటల బీమా భరోసా
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:56 PM
15,765 Farmers Get Crop Insurance Cover జిల్లా పరిధిలో పంటల బీమా నమోదుకు ప్రభుత్వం గడువు పెంచడంతో రైతుల సంఖ్య పెరిగిందని డీఏవో భవానీ శంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గరుగుబిల్లి, సెప్టెంబరు1(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలో పంటల బీమా నమోదుకు ప్రభుత్వం గడువు పెంచడంతో రైతుల సంఖ్య పెరిగిందని డీఏవో భవానీ శంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘గత నెల 15 వరకు 5,644 మంది రైతులు 3,031 హెక్టార్లకు బీమా చేయించు కున్నారు. అయితే గత నెల 31 వరకు గడువు పెంచిన తర్వాత 15 మండలాల్లో 15,765 మంది రైతులు 9,637.25 హెక్టార్లకు సంబంధించి బీమా చేయించుకున్నారు. ఇదిలాఉండగా గతేడాది 10,556 మంది రైతులు 5,563 హెక్టార్లకు సంబంధించి పంటల బీమా చేయిం చుకున్నారు. జిల్లాలో 16,610 హెక్టార్లకు పైగా వరి , 5,470 హెక్టార్లలో మొక్కజొన్న, 4,824 హెక్టార్లలో పత్తి , 1,191 హెక్టార్లలో చిరుధా న్యాలు సాగవుతున్నాయి. ప్రత్యేక అవగాహన కల్పించడంతో బీమా రైతుల సంఖ్య పెరిగింది.’ అని ఆయన తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వరి, మొక్కజొన్న సాగు చేసే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. పీఎం ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)కు సంబంధించి నమోదుకు మొదట గత నెల 15వరకు సమయం ఇచ్చారు. తక్కువ సమయంలో బీమా చేసుకునేందుకు రైతులు అంతగా ఆసక్తి కనపర్చలేదు. వరికి ఎకరాకు రూ. 800, మొక్కజొన్నకు రూ. 330 ప్రీమియం చెల్లిస్తే ఎకరాకు రూ. 40 వేల నుంచి రూ. 33 వేల మేర ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంది.