Share News

14 గంటలు నరకయాతన

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:44 AM

పార్వతీపురం-రాయగడ వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి అది. కొమరాడ సమీపంలో ఓ లారీ గుంతలు ఇరుక్కుని పోయింది.

14 గంటలు నరకయాతన
నిలిచిపోయిన ట్రాఫిక్‌

  • అంతర్రాష్ట్ర రహదారిలో ఇరుక్కుపోయిన లారీ

  • రోడ్డుకు ఇరువైపులా భారీగా నిలిచిన వాహనాలు

  • నరకం చూసిన ప్రయాణికులు, వాహనదారులు

పార్వతీపురం, జూలై 30(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం-రాయగడ వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి అది. కొమరాడ సమీపంలో ఓ లారీ గుంతలు ఇరుక్కుని పోయింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు 14 గంటల పాటు నరకం చవిచూశారు. పోలీసులు ఎక్స్‌కవేటర్‌తో లారీ పక్కకు తీసి రాకపోకలను పునరుద్ధరించారు. కొమరాడ పోలీసుస్టేషన్‌ సమీపాన రహదారిపై భారీ గుంతలు ఉన్నాయి. ఇక్కడ భారీ వాహనాలు ఇరుక్కుని పోతే అంతేసంగతులు. గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభించి పోతుంది. బుధవారం రాత్రి 10 గంటల సమ యంలో రాయగడ నుంచి విశాఖప ట్నం వెళ్లే భారీ లారీ ఇక్కడ గుం తలో దిగిపోయింది. దీంతో రెండు వైపు లా కిలోమీటర్ల కొ ద్దీ వాహనాలు నిలిచిపోయాయి. వృద్ధులు, చిన్నపిల్లలు అల్లాడిపోయారు. కాసేపట్లో పార్వతీపురం చేరుకునేవారైతే ఎటూ కదల్లేక రాత్రంతా రోడ్డు పక్కన ఉండిపోయారు. సరుకులు రవాణా చేసే వాహనాలు కూడా అక్కడే నిలిచిపోయాయి. కొంతమంది దగ్గరలో ఉన్న కొమరాడకు వెళ్లినా అక్కడి నుంచి వాహనాలు లేక ఇబ్బందులు పడ్డారు. కొమరాడ పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ప్రాంతానికి ఎక్స్‌కవేటర్‌ను పంపించారు. గురువారం మధ్యాహ్నం లారీని పక్కకు తొలగించారు. దీంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

Updated Date - Jul 31 , 2026 | 12:44 AM