Share News

టీడీపీలో 130 కుటుంబాల చేరిక

ABN , Publish Date - Sep 16 , 2026 | 12:33 AM

టీడీపీ లో చేరిన ప్రతిఒక్కరూ పార్టీ నియమాలను పాటించా లని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సూచించారు.

టీడీపీలో 130 కుటుంబాల చేరిక

  • పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి శ్రీనివాస్‌

దత్తిరాజేరు, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): టీడీపీ లో చేరిన ప్రతిఒక్కరూ పార్టీ నియమాలను పాటించా లని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సూచించారు. మండ లంలోని మరడాం గ్రామంతోపాటు మరడాం పంచా యతీ మధుర గ్రామాలైన మర్రివలస, అడవి కొత్తవ లస గ్రామాలకు చెందిన 130 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మంగళవారం వీరంతా మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో మాజీ వార్డు సభ్యులు ముగడ సునీత రామకృష్ణ, వైసీపీ నాయకు లు మల్లారపు పైడిరాజు, వర్రీ నాగేశ్వరరావు, పొందూ రి సాంబయ్య, ఈదుపల్లి అప్పలనాయుడు తదితరు లు ఉన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ సీనియర్‌ నాయకు లతో కలిసి సమన్వ యంతో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ దత్తిరాజేరు మండల అధ్యక్షుడు చప్ప చంద్రశేఖర్‌, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు బోడసింగి సత్తిబాబు, మిత్తిరెడ్డి ఈశ్వరరావు, నాయకులు మిత్తిరెడ్డి రామ, తాడి సాంబమూర్తి, ఆలమూరు నారాయణరావు, బంగారి, పోతల శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2026 | 12:33 AM