Chickens Die ఎండ వేడికి తాళలేక.. 1200 కోళ్లు మృతి
ABN , Publish Date - May 26 , 2026 | 11:38 PM
1,200 Chickens Die Unable to Withstand Scorching Heat ఎండ వేడికి తాళలేక వీరఘట్టం మండలం అచ్చెపువలస సమీపంలోని ఓ ఫారంలో సుమారు 1200 కోళ్లు మృతి చెందాయి.
వీరఘట్టం, మే26(ఆంధ్రజ్యోతి): ఎండ వేడికి తాళలేక వీరఘట్టం మండలం అచ్చెపువలస సమీపంలోని ఓ ఫారంలో సుమారు 1200 కోళ్లు మృతి చెందాయి. అధిక ఎండలకు తోడు విద్యుత్ కోతలు తీవ్రమవడమే ఇందుకు కారణమని యజమాని మర్రి సురేష్ మంగళవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుండగా.. మరోవైపు వేడిగాలులు, నీరందక కోళ్లు మృతి చెందాయని చెప్పారు. అధికా రులు స్పందించి నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు.