Share News

‘ఉల్లాస్‌’ పరీక్షకు 1,10,486 మంది హాజరు

ABN , Publish Date - Mar 15 , 2026 | 11:55 PM

జిల్లాలోని వయోజ న విద్యాశాఖ ద్వారా చేపట్టిన ఉల్లాస్‌-అక్షరాంధ్ర అసెస్మెంట్‌ పరీక్ష ఆదివారం నిర్వహించారు.

‘ఉల్లాస్‌’ పరీక్షకు 1,10,486 మంది హాజరు

విజయనగరం కలెక్టరేట్‌, రూరల్‌, మార్చి 15(ఆంధ్ర జ్యోతి): జిల్లాలోని వయోజ న విద్యాశాఖ ద్వారా చేపట్టిన ఉల్లాస్‌-అక్షరాంధ్ర అసెస్మెంట్‌ పరీక్ష ఆదివారం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయం త్రం 5 గంటలు వరకూ పరీక్ష నిర్వహించారు. జిల్లాలో 27 మండలాలు, 4 మున్సిపాల్టీల్లో 1,277 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 1,10,486 మంది హాజరయ్యారు. 1,836 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. విజయనగరం పట్టణంలోని ధర్మపురి లో ఉన్న జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ రామసుంద ర్‌రెడ్డి తనిఖీచేశారు. వయోజన విద్యా కేంద్ర పరిశీలకులు ప్రదీప్‌, హెడేయే, రాష్ట్ర పరిశీలకులు గోపాలకృష్ణలు డెంకాడ మండలం చింతలవలస గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్యా శాఖ ఉప సంచాలకులు సుబ్రమణ్య వర్మ, ఏడీ గోపాలకృష్ణ, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌పాణి తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 11:55 PM