Share News

రిజిస్ర్టేషన్‌ లేని 11 వాహనాల సీజ్‌

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:17 AM

మండలంలోని రొంపల్లిలో శనివారం తెల్లవారుజామున బొబ్బిలి రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు.

 రిజిస్ర్టేషన్‌ లేని 11 వాహనాల సీజ్‌
రొంపల్లిలో తనిఖీచేస్తున్న సీఐ శ్రీనివాస్‌:

రామభద్రపురం, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని రొంపల్లిలో శనివారం తెల్లవారుజామున బొబ్బిలి రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ర్టేషన్లు, ఎటువంటి పత్రాలు లేని 11 వాహనాలను సీజ్‌చేశారు. బొబ్బిలి టౌన్‌, రూరల్‌ పోలీసులు ప్రతి ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. గ్రామంలో ఎటువంటి అపరిచిత వ్యక్తు లు ఉన్నారా, గంజాయి, సారా ఇతర మత్తు పదార్థాలు ఉన్నాయోమోనన్న కోణం లో సోదాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా బొబ్బిలి రూరల్‌ సర్కిల్‌ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ గ్రామంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజలంతా ఐకమత్యంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా సహక రించాలని సూచించారు. అనంతరం పోలీసులు గ్రామంలో పరేడ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ జ్ఞానప్రసాద్‌, బాడంగి ఎస్‌ఐ సూర్యకుమారి పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2026 | 12:17 AM