Share News

11 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:53 PM

కొండబుచ్చిం పేట గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 11 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని శ్రీకాకుళం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మంగళవారం పట్టుకున్నారు.

11 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత
రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్న రెవెన్యూ అధికారులు

మక్కువ, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): కొండబుచ్చిం పేట గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 11 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని శ్రీకాకుళం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. శ్రీకాకుళం ప్రాంతీయ నిఘా అధికారి కె.ప్రభాకర్‌కు అందిన సమా చారం మేరకు మండల రెవెన్యూ అధికారులతో కలిసి కొండబుచ్చింపేట గ్రామంలోని లాడి ప్రసాద్‌ ఇంటిని సోదా చేశారు. అతడి ఇంటిలో 24 బస్తాల రేషన్‌ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రసాద్‌ తన గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో తెల్లరేషన్‌ కార్డుదారుల నుంచి బియ్యాన్ని కొను గోలు చేసి వాటిని ఒడిశాలోని సుంకి ప్రాంతానికి చెందిన వ్యాపారులకు విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. తదుపరి చర్యల నిమిత్తం మక్కువ సీఎ్‌స్‌డీటీకి అప్పగించామని విజిలెన్స్‌ అధికారులు తెలిపారు.

Updated Date - Nov 10 , 2026 | 11:53 PM