Goda Ranganatha గోదా రంగనాథునికి 108 రకాల ప్రసాదాలు
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:16 AM
108 Varieties of Prasadam Offered to Goda Ranganatha ధనుర్మాసోత్సవాలు సందర్భంగా ఆదివారం సాలూరులోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, పెదకోమటిపేట రామాలయంలో గోదా రంగనాథస్వామికి విశేష పూజలు చేశారు.
సాలూరు రూరల్, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ధనుర్మాసోత్సవాలు సందర్భంగా ఆదివారం సాలూరులోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, పెదకోమటిపేట రామాలయంలో గోదా రంగనాథస్వామికి విశేష పూజలు చేశారు. కుడారై వెల్లుం ( విశేష ప్రసాద సేవ )లో భాగంగా స్వామి వారికి 108 కలశాలతో ప్రసాద నివేదన చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఇక రెండు ఆలయాల్లో రుత్వికులు విశేష పాశుర తిరుప్పావైను పఠించారు. స్వామి వారికి వివిధ కైంకర్యాలను సంపద్రాయబద్ధంగా నిర్వహించారు. భక్తులకు విశేష ప్రసాదాలు అందించారు.