Share News

100% ‘SAR’ Achievement శతశాతం ‘సర్‌’ పూర్తి

ABN , Publish Date - Jul 13 , 2026 | 11:17 PM

100% ‘SAR’ Achievement జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ సోమవారానికి శతశాతం పూర్తయిందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. గడువుకు ముందే శతశాతానికి చేరువై మన్యం జిల్లా రాష్ట్రంలోనే మూడోస్థానంలో నిలిచిందన్నారు.

100% ‘SAR’ Achievement   శతశాతం ‘సర్‌’ పూర్తి
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, జూలై 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ సోమవారానికి శతశాతం పూర్తయిందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. గడువుకు ముందే శతశాతానికి చేరువై మన్యం జిల్లా రాష్ట్రంలోనే మూడోస్థానంలో నిలిచిందన్నారు. పాలకొండ, సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజక వర్గాల్లో వంద శాతం మేర డిజిటలైజేషన్‌ పూర్తయిందన్నారు. ఈ నెల 21న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 13,511 మెట్రిక్‌ టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన 46,100 మె ట్రిక్‌ టన్నుల ఎరువుల్లో ఇప్పటివరకు 22,737 మెట్రిక్‌ టన్నులు పంపిణీ చేసినట్టు చెప్పారు. వచ్చే వారం మరో 1,900 మెట్రిక్‌ టన్నులు ఎరువులు జిల్లాకు చేరనున్నాయన్నారు. ఎవరైనా ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మైభారత్‌ పోర్టల్‌లో జిల్లా యువత రిజిస్టర్‌ కావాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. దీనిద్వారా ఇతర రాష్ర్టాల్లో జరిగే కల్చరల్‌ ఎక్సేంజ్‌ ప్రోగ్రామ్స్‌, క్విజ్‌ పోటీలు, జాతీయ స్థాయి క్యాంప్‌ల్లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. 15నుంచి 29 ఏళ్ల లోపు వారికి, గ్రామీణ ప్రాంతవాసులకు ఈ పోర్టల్‌పై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి జేసీ ఆర్‌.వైశాలి, డీఆర్వో కె.హేమలత, ఉప కలెక్టర్‌ ధర్మరాజు, డీఆర్‌డీఏ పీడీ ప్రభావతి పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2026 | 11:17 PM