శతశాతం ఇళ్ల పన్నుల వసూళ్లు చేయాలి
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:22 AM
బొబ్బిలి డివిజన్‌లోని అన్ని పంచాయతీల్లో ఈనెల 31లోగా ఇంటి పన్నులు వసూళ్లు శతశాతం చేయాలని డివిజినల్ డెవల ప్‌మెంట్ ఆఫీసర్ ఎం.కిరణ్‌కుమార్ ఆదేశించారు.
రామభద్రపురం, మార్చి 20(ఆంధ్రజ్యోతి): బొబ్బిలి డివిజన్‌లోని అన్ని పంచాయతీల్లో ఈనెల 31లోగా ఇంటి పన్నులు వసూళ్లు శతశాతం చేయాలని డివిజినల్ డెవల ప్‌మెంట్ ఆఫీసర్ ఎం.కిరణ్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక మండల అభివృద్ధి కార్యాలయంలో ఇంటిపన్నుల వసూళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రామభద్రపురం మండలంలో వసూళ్ల శాతం పెంచాలని, ఇంకా రూ.17.50 లక్షలు వసూలు చేయాలని తెలిపారు. ఇంటి పన్నుల వసూళ్లకు టీములు ఏర్పాటు చేసి ఒక్కో సచివాలయం పరిధిలో ఎఫ్‌ఏను ఒక టీముగా, పీడీవోను ఒక టీముగా సుమారు 15 టీములు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వివిధ సర్వేలపై కూడా సమీక్షించారు. కార్యక్రమంలో డుమా ఏపీడీ రమామణి, ఎంపీడీవో రత్నం, ఈవోపీఆర్డీ వెంకటరమణ, డిప్యూటీ ఎంపీడీవో నాగతులసి, ఏవో సన్యాసిరావు, సీనియర్ అసిస్టెంట్ చొక్కాపు శ్రీరాములునాయుడు, జూనియర్ అసిస్టెంట్ చిట్టూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.