టీడీపీలో 100 కుటుంబాల చేరిక
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:27 AM
చిలకలపల్లిలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో అదే గ్రామానికి చెందిన 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి.
సీతానగరం (బలిజిపేట), జూన్ 11 (ఆంధ్రజ్యోతి): చిలకలపల్లిలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో అదే గ్రామానికి చెందిన 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. అరుకు పార్లమెంట్ ఉపాధ్యక్షుడుు బూరాడ రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో ఆర్‌వీ రమణతో పాటు 100 కుటుంబాలు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సమక్షంలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. అనంతరం స్థానిక సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధి, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం తదితర అంశాలపై గ్రామస్థులతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేశారు.