Share News

10 Percent 10 శాతం ఇవ్వాల్సిందే!

ABN , Publish Date - Apr 10 , 2026 | 11:39 PM

10 Percent Must Be Given! ఉపాధిహామీ నిధులతో చేపడుతున్న రహదారుల నిర్మా ణాల విషయంలో ఇంజనీరింగ్‌ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్లతో బేరానికి దిగినట్లు తెలి సింది. 10 శాతం ఇస్తేనే ఎంబుక్‌, చెక్‌ మెజర్‌మెంట్‌ చేస్తామని ఖరాఖండిగా తేల్చి చెబుతున్నారనే ఆరోపణలున్నాయి. ‘పైసలు ఇస్తేనే పాస్‌ ఆర్డర్‌ అవుతుంది. లేదంటే అంతే!’ అని తేల్చి చెబుతున్నట్లు తెలిసింది.

10 Percent   10 శాతం ఇవ్వాల్సిందే!
నిలిచిన గరుగుబిల్లి -బీవీ పురం బీటీ రహదారి పనులు

  • ‘ఉపాధి’ రోడ్డు నిర్మాణాలపై కాంట్రాక్టర్లతో బేరం

  • ఫిర్యాదులు వెళ్లినా పట్టని పంచాయతీరాజ్‌ యంత్రాంగం

  • నత్తనడకన బీటీ రహదారుల పనులు

గరుగుబిల్లి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): ఉపాధిహామీ నిధులతో చేపడుతున్న రహదారుల నిర్మా ణాల విషయంలో ఇంజనీరింగ్‌ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్లతో బేరానికి దిగినట్లు తెలి సింది. 10 శాతం ఇస్తేనే ఎంబుక్‌, చెక్‌ మెజర్‌మెంట్‌ చేస్తామని ఖరాఖండిగా తేల్చి చెబుతున్నారనే ఆరోపణలున్నాయి. ‘పైసలు ఇస్తేనే పాస్‌ ఆర్డర్‌ అవుతుంది. లేదంటే అంతే!’ అని తేల్చి చెబుతున్నట్లు తెలిసింది. కాంట్రాక్టర్లు ఎనిమిది శాతం మేర ముట్టజెబుతున్నట్లు సమాచారం. ఈ మొత్తాన్ని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు నుంచి సంబంధిత పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు సర్దుకుంటున్నారనే వ్యాఖ్యలు లేకపోలేదు. చేతులకు మామూళ్లు అందిన తర్వాతనే సంబంధిత అఽధికారులు ఆయా బిల్లులను ఉపాధి కార్యాలయాలకు అందిస్తున్నట్లు తెలిసింది.

ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సీసీ, బీటీ రహదారుల నిర్మాణాలకు సంబంధిత మండల ఇంజనీరింగ్‌ అధికారులు ఎంబుక్‌లతో పాటు చెక్‌ మెజర్‌మెంట్‌ చేయాల్సి ఉంది. బిల్లుల చెల్లింపులకు గాను వారు పంచాయతీరాజ్‌ అధికారులకు సిఫారసు చేయాల్సి ఉంది. ఇదే అదునుగా వారు కాంట్రాక్టర్లను డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా మార్చి నెలాఖరుకు ఈ పనులు పూర్తి చేయాల్సి ఉన్నా.. ఆశించిన స్థాయిలో నిర్మాణాలు జరగడం లేదు. దీంతో ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించారు. కాగా జిల్లాలో పలుచోట్ల చేపడుతున్న రహదారుల నిర్మాణాలు కోర్టు పరిధిలో ఉన్నాయని, పలుచోట్ల నాణ్యతా లోపాలు ఉన్నాయని ఫిర్యాదులు వెళ్లినా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇంకొన్నిచోట్ల పనులు మంజూరు ఒక చోట, నిర్మాణం మరో చోట చేపడుతున్నా స్పందించే వారే కరువయ్యారు. మరోవైపు గ్రామస్థాయిలో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు చెప్పినట్టుగానే పనులు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. మొత్తంగా కోట్లాది రూపాయలతో చేపడుతున్న రోడ్ల నిర్మాణాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీసీ రోడ్ల మంజూరు.. పనులు ఇలా..

- పార్వతీపురం సబ్‌ డివిజన్‌ పరిధిలోని బలిజిపేట, పార్వతీపురం, సీతానగరం మండలాలకు 546 సీసీ రోడ్ల పనులు మంజూరు చేయగా 227 నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 195 వరకు పనులు పలు దశల్లో ఉన్నాయి. అయితే ఇంకా 123 పనులు ప్రారంభించాల్సి ఉంది.

- సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాలకు 174 పనులు మంజూరు కాగా 86 పనులు పూర్తయ్యాయి. 35 పనులు పలు దశల్లో ఉన్నాయి. 52 పనులు ఇంకా ప్రారంభం కాలేదు.

- కురుపాం సబ్‌ డివిజన్‌లో గరుగుబిల్లి, కొమరాడ మండలాలకు 252 పనులు మంజూరు కాగా 119 పనులు పూర్తయ్యాయి. 49 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 73 పనులు ప్రారంభం కాలేదు. రెండో సెక్షన్‌కు సంబంధించి గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కురుపాం మండలాలకు 671 పనులు మంజూరు కాగా 92 పనులు పూర్తయ్యాయి. మరో 68 పనులు పలు దశల్లో ఉన్నాయి. ఇంకా 482 పనులు ప్రారంభం కాలేదు.

- పాలకొండ, భామిని, సీతంపేట, వీరఘట్టాం మండలాలకు 294 పనులు మంజూరు కాగా 66 పూర్తయ్యాయి. మరో 69 పనులు పలు దశల్లో ఉండగా.. 138 పనులు ప్రారంభం కావల్సి ఉంది. మొత్తంగా జిల్లాలో 268.46 మీటర్లు సీసీ రహదారులకు 1937 పనులు మంజూరు చేశారు. ఇందులో పూర్తయినవి 590, పలు దశల్లో ఉన్నవి 416, ప్రారంభం కాని 868 పనులు వరకూ ఉన్నాయి. వాటి నిర్మాణాలకు ఉపాధి నిధులు రూ. 12,205.05 లక్షలతో ప్రతిపాదనలు చేశారు. అయితే గ్రామస్థాయిలో సీసీ రహదారుల పనులు కొంతమేర వేగవంతమయ్యాయి.

బీటీ రోడ్ల పనులు ఇలా..

జిల్లాలో 197.37 మీటర్ల మేర 394 బీటీ రహదారుల నిర్మాణాలకు రూ. 153 కోట్లు మంజూరు చేశారు. అయితే ఇప్పటివరకు 32 పనులు పూర్తయ్యాయి. 289 బీటీ రహదారుల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 73 రహదారుల పనులు ప్రారంభం కావాల్సి ఉంది. మొత్తంగా ఈ పనులు నత్తనడకన సాగుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కాగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో కొన్నిచోట్ల బీటీ రహదారులను నిర్మించినా.. నేటికీ చెల్లింపులు కాలేదు. దీంతో సంబంధిత కాంట్రాక్టర్లు పనులు చేయాలా? వద్దా! అన్న మీమాంసలో ఉన్నారు.

ఆరోపణల్లో నిజం లేదు..

రహదారుల బిల్లుల రికార్డింగ్‌లకు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. కొద్ది రోజుల కిందట ఈఈగా బాధ్యతలు స్వీకరించా. అంతకుముందు వీఎస్‌ నగేష్‌బాబు ఈఈగా వ్యవహరించారు. ఆయన సెలవుపై వెళ్లడంతో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నా. చేసిన పనులు మేరకు ఎంబుక్‌, రికార్డింగ్‌ను సంబంధిత మండలాల ఇంజనీరింగ్‌ అధికారులు నిర్వహించారు. చెల్లింపులకు సిఫారసు చేశాం. నిర్మాణాలకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్‌, విజిలెన్స్‌ విచారణతో పాటు సామాజిక తనిఖీల నిర్వహణ జరుగుతుంది. లోపాలు, అవకతవకలు ఉన్న ప్రాంతాల్లో సంబంధిత అధికారులు బాధ్యత వహిస్తారు.

-డబ్ల్యూవీఎస్‌ఎస్‌ శర్మ, ఈఈ, పంచాయతీరాజ్‌ విభాగం, పార్వతీపురం

Updated Date - Apr 10 , 2026 | 11:39 PM