Share News

ఘనంగా ‘జనసేన’ ఆవిర్భావ దినోత్సవం

ABN , Publish Date - Mar 15 , 2026 | 12:13 AM

బొబ్బిలిలో శనివారం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్పవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ‘జనసేన’ ఆవిర్భావ దినోత్సవం
కేక్‌ కట్‌ చేస్తున్న నియోజకవర్గ ఇన్‌చార్జి అప్పలస్వామి

బొబ్బిలి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలిలో శనివారం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్పవాన్ని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి గిరడ అప్పలస్వామి, సీనియర్‌ నాయకుడు పెద్దింటి మనోజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరిగింది. తొలుత పార్టీ కార్యాలయ ప్రాంగణంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. అనంతరం పార్టీ శ్రేణులు, యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కస్తూర్బా విద్యాలయానికి చెందిన పదో తరగతి విద్యార్థులకు పెన్నులు, క్లిప్‌బోర్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక స్వామివారి వీధిలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. తర్వాత పట్టణ ప్రధాన వీధుల్లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనాథాశ్రమంలోని పిల్లలకు రాత్రి భోజనాలను సమకూర్చారు. ఈ సందర్భంగా అప్పలస్వామి, మనోజ్‌ కుమా ర్‌ మాట్లాడారు. మానవతావాదిగా గుర్తింపు పొందిన పవన్‌కల్యాణ్‌ నేతృ త్వంలో జనసేన పార్టీ ఎదుగుతున్న తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోం దన్నారు. నిబద్ధత, నీతినిజాయితీలు, చిత్తశుద్ధిలో నిలువెత్తు నిదర్శనంగా అటు పార్టీ, ఇటు ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారన్నారు. కార్య క్రమంలో నాయకులు రేవెళ్ల కిరణ్‌కుమార్‌, కొట్టేడ సురేష్‌, పైల హరి ప్రసాద్‌, జమ్ము గణేశ్‌, ఉల్లి సంతోష్‌, వీర మహిళలు రామలక్ష్మి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 12:13 AM