రోడ్డు నిర్మాణంలో లోపాలు ఉంటే చర్యలు
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:09 AM
ఉపాధి హామీ నిధులతో నిర్మాణం చేపడు తున్న బీటీ రహదారుల నిర్మాణంలో లోపాలు ఉంటే చర్యలు తప్పవని పార్వతీపురం పంచా యతీరాజ్ శాఖ ఈఈ వీఎస్ నగేశ్‌బాబు హెచ్చరించారు.
గరుగుబిల్లి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ నిధులతో నిర్మాణం చేపడు తున్న బీటీ రహదారుల నిర్మాణంలో లోపాలు ఉంటే చర్యలు తప్పవని పార్వతీపురం పంచా యతీరాజ్ శాఖ ఈఈ వీఎస్ నగేశ్‌బాబు హెచ్చరించారు. గురువారం గరుగుబిల్లి నుంచి పెద్దూరు మీదుగా బీవీ పురం వరకు నిర్మి స్తున్న బీటీ రహదారి పనుల నిర్వహణపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘చెరువు మట్టి తీసి.. బెర్ము వేసి’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ప్రజలకు ఉపయోగపడే రహ దారి పనుల్లో నాణ్యతా లోపాలు ఉంటే చర్య లు తప్పవన్నారు. రహదారి నిర్మాణానికి సంబంధించి బెర్ములకు అవసరమైన మట్టిని వేరే ప్రాంతం నుంచి తరలించాల్సి ఉండగా, పెద్దూరు గ్రామ పరిధిలోని దక్షిణాయిని చెరువు గర్భంలోని మట్టిని వేసి రోలింగ్ చేశారన్నారు. రహదారి నిర్మాణానికి రూ. 3 కోట్లు మేర బీటీ రహదారి పనులకు నిధులు మంజూరయ్యాయన్నారు. చెరువు గర్భంలో తీసిన మట్టి ప్రాంతం లో అవసరమైన నిధులతో పూడ్చడం జరుగుతుందన్నారు. చెరువు గర్భం పూర్తిస్థాయిలో పూడ్చేంతవరకు రహదారి పనులు నిలుపుదల చేస్తున్నామన్నారు. దక్షిణాయిని చెరువుకు అధికంగా వరద తాకిడి నెలకొన్న దృష్ట్యా వరద నీరు బయటకు పోయేందుకు వీలుగా అవసరమైన కల్వర్టుల ను ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీపీ మర్రాపు పురుషోత్తంనాయుడు ఆయన్ని కోరారు. పరిశీలనలో పంచాయతీరాజ్ శాఖ డీఈఈ ఎన్.వెంకటరావు, జేఈ జి.గౌరీ శంకర్‌తో పాటు రైతులు పాల్గొన్నారు.