Ensure that 50 votes are registered per day.
ABN , Publish Date - Jun 27 , 2026 | 11:59 PM
Ensure that 50 votes are registered per day. ప్రతి ఒక్కరికీ ఓటు ఉండేలా, బూత్ లెవల్‌లో రోజుకు 50 ఓట్లు నమోదు అయ్యేలా చూడాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ నాయకుల సమావేశం శనివారం విజయనగరంలో జరిగింది.
రోజుకు 50 ఓట్లు నమోదయ్యేలా చూడండి
ఎక్కువ ఓట్లు ఉండే బూత్‌లో ప్రక్రి యను వేగవంతం చేద్దాం
కష్టపడే కార్యకర్తలకు పార్టీలో ఉన్నత గుర్తింపు
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం, జూన్ 27(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరికీ ఓటు ఉండేలా, బూత్ లెవల్‌లో రోజుకు 50 ఓట్లు నమోదు అయ్యేలా చూడాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ నాయకుల సమావేశం శనివారం విజయనగరంలో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం సాగుతున్న సర్ ప్రక్రియలో ఎక్కువ ఓట్లు వున్న బూత్‌లో నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కలెక్టర్‌ను కలుస్తామన్నారు. అందరికీ ఓటు ఉండేలా చూడాలని చెప్పారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించడం కోసం వర్కింగ్ ప్రెసెడెంట్ నారా లోకేష్ ఆలోచనతో ప్రతినెలా తొలి బుధవారం బూత్ లెవల్, మండల, జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలన్నారు. పార్టీ విధి విధానాలు విస్తృత పరచడం కోసం ఈ సమావేశాలు దాహోదపడతాయన్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మాట్లాడుతూ, మహానాడు స్ఫూర్తితో ప్రతి కార్యకర్త ఉత్సాహంగా పనిచేయాలన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు నాయకులు సమాయత్తం కావాలన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, సామాన్య కార్యకర్త నుంచి ఉన్నత స్థాయిలో గుర్తింపు ఇచ్చేది తెలుగుదేశం పార్టీయేనని చెప్పారు. ఎంపికైన వివిధ కమిటీల సభ్యులంతా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. చీపురుపల్లి ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు కళా వెంకటరావు మాట్లాడుతూ, పార్టీ కమిటీలకు తాజాగా ఎంపికైన 42 మంది సభ్యుల్లో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో అనుబంధం కలిగిన వారు ఉండడం ఆనందదాయకమన్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ, 20 ఏళ్ల తరువాత ఓటరు జాబితాలో వస్తున్న మార్పులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనాయకుడు నారా లోకేష్ సారధ్యంలో ఉత్తరాంధ్రలో ఎక్కువ పరిశ్రమలు, పెట్టుబడులు రావడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు మాట్లాడుతూ కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీ పదవులు ఇచ్చి గుర్తించడం కేవలం టీడీపీ వల్లే సాధ్యమన్నారు. సర్ కార్యక్రమంలో ఉత్సాహంగా ఉండాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై దృష్టి సారించాలన్నారు.