అనకాపల్లిలో జడ్సీ విస్తృత పర్యటన
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:35 PM
జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ కె.చక్రవర్తి శనివారం విస్తృతంగా పర్యటించారు.
విధులకు గైర్హాజరైన ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ఆదేశం
అనకాపల్లి టౌన్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ కె.చక్రవర్తి శనివారం విస్తృతంగా పర్యటించారు. 84వ వార్డు పరిధిలో కార్మికుల హాజరు పట్టికను పరిశీలించారు. విధులకు గైర్హాజరైన ఒక మేస్త్రీ, ఒక కార్మికుడిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేసినట్టు జోనల్ కమిషనర్ తెలిపారు. కాగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి పేరుకుపోయిన చెత్తను త్వరితగతిన డంపింగ్‌యార్డుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులను ఆదేశించారు. అంతేకాకుండా పలుచోట్ల రోడ్లపై పేరుకుపోయిన చెత్తను దగ్గరుండి కార్మికులతో వాహనాల్లోకి ఎక్కించి తరలింపజేశారు. మహిళా కార్మికులతో రహదారులను శుభ్రంగా చేయించారు. పరిశుభ్రత విషయంలో ఏ ఒక్కరి నుంచి ఫిర్యాదులు అందకుండా ఎప్పటికప్పుడు రహదారులను శుభ్రం చేయాలని సూచించారు. ఆయన వెంట పారిశుధ్య విభాగం ఇన్‌స్పెక్టర్, కార్యదర్శులు ఉన్నారు.