Share News

25 మంది అభ్యర్థులతో వైసీపీ రెండో జాబితా

ABN , Publish Date - Oct 18 , 2026 | 01:11 AM

జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శనివారం విడుదల చేసింది.

25 మంది అభ్యర్థులతో వైసీపీ రెండో జాబితా

విశాఖపట్నం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శనివారం విడుదల చేసింది. మరో 12 వార్డులకు అభ్యర్థులను ఆదివారం ఉదయం ప్రకటిస్తామని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రెండో జాబితా వివరాలు...ఒకటో వార్డు కనకాల హేమలతకు, నాలుగో వార్డు అల్లిపల్లి పార్వతికి, ఆరో వార్డు పోతిన హనుమంతరావుకు, ఎనిమిదో వార్డు పిళ్లా అనితకు, 11వ వార్డు మాదు రాజబాబుకు, 13వ వార్డు పత్తివాడ వెంకటలక్ష్మికి, 14వ వార్డు రెడ్డి కిరణ్మయికి, 15వ వార్డు మొల్లి హేమంత్‌కు, 16వ వార్డు సత్యాల సాగరికకు, 17వ వార్డు నల్ల రవికుమార్‌కు, 18వ వార్డు పీలా ప్రేమకిరణ్‌ జగదీశ్‌కు, 20వ వార్డు పల్లా పద్మావతికి, 21వ వార్డు పీలా సత్యవతికి, 22వ వార్డు ఉమ్మడి దేవికి, 23వ వార్డు కర్రి శ్రీలక్ష్మికి, 24వ వార్డు మద్ది రమణమ్మకు, 25వ వార్డు మదుపాడ రవికుమార్‌, 27వ వార్డు సారిపల్లి రాధ, 39వ వార్డు దొడ్డి బాపుఆనంద్‌కు, 40వ వార్డు బొర్ర విజయలక్ష్మికి, 44వ వార్డు కోనాడ పద్మనూకంబాకు, 47వ వార్డు మళ్లదేవి విశాలాక్షికి, 51వ వార్డు గదగమ్మ శిరీషకు, 60వ వార్డు సాతిన సారంగధరుడుకు, 25వ వార్డు జియ్యాని సత్యకు, 74వ వార్డు యర్రశెట్టి శ్రీనివాసరావుకు, 76వ వార్డు సోమాదల సురేష్‌కు, 79వ వార్డు అంగవర్మకు, 88వ వార్డు గోడబ మనోజుకుమార్‌కు, 91వ వార్డు మద్దాల అప్పారావుకు, 97వ వార్డు కంటంరెడ్డి మనోజుకుమార్‌కు, 105వ వార్డు బసవతు మురళీకృష్ణనాయక్‌కు, 119వ వార్డు దాసరి అన్నపూర్ణకు, 120వ వార్డు కర్రి అప్పలస్వామికి కేటాయించారు.


ఉక్కులో 1,200 మందికి పదోన్నతులు

ఉక్కుటౌన్‌షిప్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ ప్లాంటులో సుమారు 1,200 మందికి పైగా అధికారులకు యాజమాన్యం పదోన్నతులు కల్పించింది. పదోన్నతుల కోసం అధికారులు 2019 నుంచి ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉక్కు యాజమాన్యం నిర్ణీత నిబంధనలు, అర్హతలు, ప్రతిభ ఆధారంగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించింది.

Updated Date - Oct 18 , 2026 | 01:11 AM