రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:35 AM
మండలంలోని బస్కీ పంచాయతీ పరిధిలోని జగిని గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఢీకొని వెళ్లిపోయిన వ్యాన్‌ను ఎల్.కోట వద్ద పట్టుకున్న పోలీసులు
అరకులోయ, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని బస్కీ పంచాయతీ పరిధిలోని జగిని గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. సూసలి గ్రామానికి చెందిన పాంగి నర్సింగ్(27) బైక్‌పై బస్కీ నుంచి గ్రామానికి వెళుతున్నాడు. జగిని గ్రామ సమీపానికి వచ్చే సరికి ఎదురుగా వస్తున్న వ్యాన్ బలంగా బైక్‌ను ఢీకొని వెళ్లిపోయింది. దీంతో నర్సింగ్ కింద పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో వ్యాన్‌ను ఎల్.కోట వద్ద పట్టుకున్నారు. నర్సింగ్ మృతదేహాన్ని పోలీసులు అరకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహం వద్ద అతని తల్లిదండ్రులు, బంధువులు విలపించారు.