గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో యువ ఇంజనీర్‌కు చోటు
ABN , Publish Date - Aug 02 , 2026 | 11:39 PM
పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు యువ ఇంజనీర్ చింతలపూడి సాయికుమార్. భారత్- చైనా సరిహద్దులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డులో బైక్‌పై ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు.
ప్రపంచంలో ఎత్తైన రోడ్డు మార్గంలో బైక్‌పై ప్రయాణించిన సాయికుమార్
అచ్యుతాపురం రూరల్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు యువ ఇంజనీర్ చింతలపూడి సాయికుమార్. భారత్- చైనా సరిహద్దులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డులో బైక్‌పై ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు.
విజయవాడకు చెందిన చింతలపూడి సాయికుమార్ అచ్యుతాపురం బ్రాండిక్స్-2 దుస్తుల కంపెనీలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు సాహస యాత్రలు చేయడం ఇష్టం. ఏదైనా సాధించాలనే తపనతో ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్‌లపై విజయవాడ నుంచి గత నెల 15న భారత్- చైనా సరిహద్దులో గల లే-లడక్ ప్రాంతానికి బయలుదేరారు. ప్రతికూల వాతావరణంలో ఎన్నో కష్టాలకు ఓర్చి అత్యంత ఎత్తైన ఉమ్లింగ్ లా ప్రాంతానికి చేరుకున్నారు. సముద్ర మట్టానికి 10,024 అడుగులు(5,798 మీటర్లు) ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకుని ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ఈ సాహస యాత్రను విజయవంతంగా పూర్తి చేసి గత నెల 24న తిరిగి విజయవాడ వచ్చారు. ఆదివారం బ్రాండిక్స్ కంపెనీకి వచ్చిన ఆయనను యాజమాన్యం, తోటి ఉద్యోగులు అభినందించారు.