Share News

సమగ్ర సమాచారంతో పీజీఆర్‌ఎస్‌కు రావాలి

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:53 PM

తమ శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో మీకోసం కార్యక్రమానికి హాజరుకావాలని జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి అధికారులను ఆదేశించారు.

సమగ్ర సమాచారంతో పీజీఆర్‌ఎస్‌కు రావాలి
ఐటీడీఏ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ టి.నిశాంతి, పక్కన జేసీ శ్రీపూజ

అధికారులకు కలెక్టర్‌ నిశాంతి ఆదేశం

ఫిర్యాదులపై అధికారులకు అవగాహన ఉండాలి

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌లో 84 వినతులు స్వీకరణ

పాడేరు, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): తమ శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో మీకోసం కార్యక్రమానికి హాజరుకావాలని జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీకోసం)లో ఆమెఅధికారులను ఉద్దేశించి మాట్లాడారు. పీజీఆర్‌ఎస్‌కు అధికారులు అరకొర సమాచారంతో హాజరు కావడం వల్ల ప్రయోజనం ఉందన్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన అర్జీలు, ఫిర్యాదులపై అధికారులకు కచ్చితంగా అవగాహన ఉండాలన్నారు. ప్రజలు సమర్పించే వినతులను క్షుణ్ణంగా పరిశీలించి గడవులోగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పీజీఆర్‌ఎస్‌ సేవలపై ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రభుత్వ ప్రజాభిప్రాయాలను సేకరిస్తున్నదని, ఈక్రమంలో అధికారులు పీజీఆర్‌ఎస్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ఈకార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి, జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ 84 వినతులను స్వీకరించారు. మీకోసంలో సమర్పించిన అర్జీలపై తాజా స్థితిగతులను తెలుసుకునే ందుకు ప్రజలు 1100 కాల్‌ సెంటర్‌ను వినియోగించుకోవాలని కలెక్టర్‌ టి.నిశాంతి సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో ఎంవీఎస్‌.లోకేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, డీఎంహెచ్‌వో కృష్ణమూర్తినాయిక్‌, డీఈవో రామకృష్ణారావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమిళ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నందు, జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, హౌసింగ్‌ పీడీ బి.బాబు, డీపీవో చంద్రశేఖర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ వీబీ.నాగేశ్వరరావు, జిల్లా టూరిజం ఆఫీసర్‌ జి.దాసు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ నీలకంఠరావు, డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీబాయి, సీపీవో ప్రసాద్‌, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, నేషనల్‌ హైవే డీటీ వి.ధర్మరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 11:53 PM