Share News

ఉపమాకలో యోగాంధ్ర సందడి

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:53 PM

మండలంలోని ఉపమాక వేంకటేశ్వరస్వామి సన్నిధిలో బుధవారం ఉదయం యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఉపమాకలో యోగాంధ్ర సందడి
ఉపమాక ఆలయం వద్ద యోగాంధ్ర కార్యక్రమం

నక్కపల్లి, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉపమాక వేంకటేశ్వరస్వామి సన్నిధిలో బుధవారం ఉదయం యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు యోగాసనాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలుచేస్తోంది. దీనిలో భాగంగా టెంపుల్‌ యోగా సామూహిక ప్రొటోకాల్‌ యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేశ్‌, కలెక్టర్‌ విజయకృష్ణ, పలుశాఖల జిల్లా స్థాయి అధికారులు ప్రజలతో కలిసి యోగాసనాల సాధన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత, ఎంపీ రమేశ్‌, కలెక్టర్‌ను ఉపమాక ఆలయ మాజీ చైర్మన్‌ కొప్పిశెట్టి బుజ్జి దుశ్శాలువలతో సత్కరించారు. యోగాంధ్ర అనంతరం హాకీ క్రీడాకారిణి నమ్మి గీతాశ్రీని, ఆయుష్‌ ఆర్‌డీడీ కె.శ్రీనివాసులు, ఆయుష్‌ వైద్యాధికారులు, యోగా గురువులను హోంమంత్రి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ సత్కరించారు. నియోజకవర్గం కన్వీనర్‌ కొప్పిశెట్టి వెంకటేశ్‌, ఎండోమెంట్‌ ఏసీ సుధారాణి, నాలుగు మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 11:53 PM