Share News

నేడు ఉపమాకలో యోగాంధ్ర

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:24 AM

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం సామూహిక యోగాసనాల ప్రదర్శనకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.

నేడు ఉపమాకలో యోగాంధ్ర
ఉపమాక వెంకన్న ఆలయం వద్ద యోగాసనాల ప్రధాన వేదిక

హాజరుకానున్న మంత్రి అనిత, ఎంపీ రమేశ్‌, కలెక్టర్‌, ఎస్పీ

వెంకన్న ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు

నక్కపల్లి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం సామూహిక యోగాసనాల ప్రదర్శనకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. తెల్లవారుజామున 5.30 గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రొటోకాల్‌ యోగాసనాలు వుంటాయని అధికారులు చెప్పారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ సీఎం రమేశ్‌, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌ సిన్హా, ఆయుష్‌ ఆర్‌డీడీ కె.శ్రీనివాసులు తదితరులు హాజరుకానున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉపమాక ఆలయం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను డీఆర్‌డీఏ ఇన్‌ఛార్జి పీడీ డైజీ, డీఎల్‌పీవో కొండలరావు, టీడీపీ నియోజకవర్గం కన్వీనర్‌ కొప్పిశెట్టి వెంకటేశ్‌, ఎంపీడీవో కె.చలపతిరావు, కూటమి నాయకులు, ఆయుష్‌ వైద్యాధికారులు పరిశీలించారు.

Updated Date - Jun 17 , 2026 | 12:24 AM