Share News

యోగా జీవితంలో భాగం చేసుకోవాలి

ABN , Publish Date - Jun 20 , 2026 | 11:16 PM

యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి పిలుపునిచ్చారు.

యోగా జీవితంలో భాగం చేసుకోవాలి
యోగాంధ్ర వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్‌ టి. నిషాంతి, జేసీ తిరుమణి శ్రీపూజ, పీవో ఐటీడీఏ ఆదిత్యవర్మ తదితరులు

జిల్లా కలెక్టర్‌ నిషాంతి పిలుపు

ఆసనాలు వేసిన కలెక్టర్‌, జేసీ, ఐటీడీఏ పీవో, అధికారులు, గిరి మహిళలు, విద్యార్థులు

అరకులోయ, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి పిలుపునిచ్చారు. శనివారం మాడగడ సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని ఆమె జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యోగాను ఒకరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి రోజూ అలవాటు చేసుకోవాలన్నారు. మానసిక వత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యలకు యోగా చక్కటి పరిష్కారం చూపుతుందన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా మాడగడలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రకృతి అందాల నడుమ సూర్యోదయం వేళలో పర్యాటక కేంద్రమైన మాడగడ సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి, జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ, పీవో ఐటీడీఏ ఆదిత్యవర్మ, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ట్రైకార్‌ చైర్మన్‌ కె.కృష్ణారావు, జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, బీజేపీ సీనియర్‌ నాయకుడు పాంగి రాజారావు, జనసేన అరకు నియోజకవర్గ ఇన్‌చార్జి శెట్టి చిరంజీవి, జిల్లా, మండల అధికారులు, రాజకీయ నాయకులు, గిరిజన మహిళలు, విద్యార్థులు ఆసనాలు వేశారు.

Updated Date - Jun 20 , 2026 | 11:16 PM