నేడు యోగాంధ్ర
ABN , Publish Date - Jun 21 , 2026 | 01:09 AM
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం ఆర్కే బీచ్‌రోడ్డులో గల ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లోని సాగరిక ఆడిటోరియంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు.
ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లోని సాగరిక ఆడిటోరియంలో కార్యక్రమం
ఉదయం 6.15 గంటల నుంచి ఏడు గంటల వరకు నిర్వహణ
విశాఖపట్నం, జూన్ 20 (ఆంధ్రజ్యోతి):
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం ఆర్కే బీచ్‌రోడ్డులో గల ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లోని సాగరిక ఆడిటోరియంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. ఉదయం ఆరు గంటలకు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం 6.15 గంటల నుంచి ఏడు గంటల వరకు సుమారు 45 నిమిషాలపాటు కామన్ యోగా, సామూహిక సాధన నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, యువతీయువకులు, మహిళలు పాల్గొననున్నారు. సామూహిక యోగాసనాల తరువాత విద్యార్థులతో ప్రత్యేక యోగా ఆకృతుల ప్రదర్శన, యోగా గురువులకు సత్కారం, జిల్లా స్థాయి యోగా పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని తొలుత ఆర్కే బీచ్‌రోడ్డులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే శనివారం రాత్రి భారీవర్షం కురవడంతో వేదికను సాగరిక ఆడిటోరియానికి మార్చారు.
యోగా వేడుకల్లో పాల్గొనాలి: కలెక్టర్
ఆదివారం ఉదయం నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా వేడుకల్లో అందరూ పాల్గొనాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. యోగా పట్ల అవగాహన పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.