నేడు మాడగడ సర్‌రైజ్ వద్ద యెగాంధ్ర వేడుకలు: కలెక్టర్
ABN , Publish Date - Jun 19 , 2026 | 10:41 PM
ఈనెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం అరకులోయ మండలం మాడగడ సర్‌రైజ్ పాయింట్ వద్ద యోగాంధ్ర వేడుకలను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పాడేరు, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): ఈనెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం అరకులోయ మండలం మాడగడ సర్‌రైజ్ పాయింట్ వద్ద యోగాంధ్ర వేడుకలను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా టూరిజం థీమ్‌తో యోగాంధ్రను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సూచించిన డ్రెస్ కోడ్‌తో శనివారం ఉదయం 5.30 గంటలకే వేదిక వద్దకు రావాలని, కార్యక్రమంలో యువత, విద్యార్థులు, ప్రజలు, అందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ నిషాంతి కోరారు.