Share News

‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’పై వైసీపీ దాడి హేయం

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:43 PM

రాష్ట్ర రాజధాని అమరావతిపై అక్కసుతో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వ్యక్తం చేస్తున్న వింత వైఖరులను, ఆ పార్టీ అనాలోచిత నిర్ణయాలను నిర్భయంగా వ్యక్తం చేసిన ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’పై వైసీపీ నేతలు దాడికి పాల్పడడం హేయమైన చర్య అని టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీవ్రంగా ఖండించారు.

‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’పై వైసీపీ దాడి హేయం
మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

ఫ్యాక్షన్‌ సంస్కృతిని వీడాలని హితవు

పాడేరు, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతిపై అక్కసుతో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వ్యక్తం చేస్తున్న వింత వైఖరులను, ఆ పార్టీ అనాలోచిత నిర్ణయాలను నిర్భయంగా వ్యక్తం చేసిన ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’పై వైసీపీ నేతలు దాడికి పాల్పడడం హేయమైన చర్య అని టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌లోని ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌ కార్యాలయం, రాష్ట్రంలో పలుచోట్ల కార్యాలయాల ముందు ఆందోళనలు, ‘ఆంధ్రజ్యోతి’ ప్రతుల దహనంపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ’ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మంగళవారం మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్‌ ప్రకటిస్తున్న వైఖరులు సక్రమంగా లేనప్పటికీ, వాటినే పార్టీ శ్రేణులు సమర్ధిస్తున్నాయని, జగన్‌కు అమరావతిపై ఒక స్పష్టమైన వైఖరి లేదని ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’ ఎండీ వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకులో ప్రస్తావించడాన్ని తప్పు పట్టడం ఘోరమన్నారు. వైఎస్‌.జగన్‌ వైఖరిని మాత్రమే ఆర్కే కొత్తపలుకులో ప్రస్తావించినప్పటికీ, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’ కార్యాలయాలపై దాడులకు పూనుకుంటున్నారని గిడ్డి ఈశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు సరికాదని, వాస్తవానికి జగన్‌ విష పత్రికలో రాతలకు వారిని ఏమీ చేయాలో వారే ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఆఖరికి జగన్‌ తల్లీ, చెల్లెలపై సైతం సాక్షిలో తప్పుడు కథనాలు రాసిన పరిస్థితిని ప్రజలు మర్చిపోలేదన్నారు. అటువంటిది జగన్‌ వైఖరిని మాత్రమే ప్రస్తావించిన ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’పై వైసీపీ దాడులకు పాల్పడేందుకు తెగబడడం అన్యాయమన్నారు. వైసీపీ అధినేత, నేతలు దాడులు, ఫ్యాక్షన్‌ సంస్కృతిని విడనాడాలని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాలని ఆమె హితవు పలికారు.

Updated Date - Apr 07 , 2026 | 11:43 PM