అడిషనల్ ఎస్‌పీగా వై.శృతి బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:11 AM
ల్లా అడిషనల్ ఎస్‌పీ(అడ్మిన్)గా వై.శృతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 2016లో గ్రూప్-1లో డీఎస్‌పీగా ఉద్యోగం పొందిన ఆమె తొలి పోస్టింగ్ ఆత్మకూరు, తరువాత శ్రీకాకుళంలో పని చేశారు.
పాడేరు, జూన్ 24(ఆంధ్రజ్యోతి): జిల్లా అడిషనల్ ఎస్‌పీ(అడ్మిన్)గా వై.శృతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 2016లో గ్రూప్-1లో డీఎస్‌పీగా ఉద్యోగం పొందిన ఆమె తొలి పోస్టింగ్ ఆత్మకూరు, తరువాత శ్రీకాకుళంలో పని చేశారు. ప్రస్తుతం సీఐడీ డీఎస్‌పీగా పని చేస్తున్న ఆమెకు ఇటీవల అడిషనల్ ఎస్‌పీగా పదోన్నతి కల్పించి జిల్లాకు నియమించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, మాదక ద్రవ్యాల నియంత్రణ, ప్రజలకు పోలీసుల సేవలు మరింతగా చేరవ చేసేందుకు కృషి చేస్తానని శృతి పేర్కొన్నారు. అంతకు ముందు ఆమెకు పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపి ఘనంగా స్వాగతం పలికారు.