నూకాంబిక నూతన ఆలయంలో పూజలకు శ్రీకారం
ABN , Publish Date - Mar 07 , 2026 | 12:50 AM
భారీ ఎత్తున పునర్నిర్మితమైన స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయం ప్రారంభోత్సవంలో భాగంగా శుక్రవారం పలు ముందస్తు కార్యక్రమాలు, పూజలు నిర్వహించారు. నూతనఆలయ మండపంలో విఘ్నేశ్వర పూజ, భగవతి పుణ్యాహ వచనం, రుత్విక్ వరుణ, రక్ష సూత్రధారణ, దీక్షాధారణ, అగ్నిప్రతిష్ఠ నిరాజనం, మంత్రపుష్పం, వేద పారాయణం, అంకురార్పణ, హోమం, తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
హాజరైన ఆర్‌జేసీ, ఇతర అధికారులు
అనకాపల్లి టౌన్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): భారీ ఎత్తున పునర్నిర్మితమైన స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయం ప్రారంభోత్సవంలో భాగంగా శుక్రవారం పలు ముందస్తు కార్యక్రమాలు, పూజలు నిర్వహించారు. నూతనఆలయ మండపంలో విఘ్నేశ్వర పూజ, భగవతి పుణ్యాహ వచనం, రుత్విక్ వరుణ, రక్ష సూత్రధారణ, దీక్షాధారణ, అగ్నిప్రతిష్ఠ నిరాజనం, మంత్రపుష్పం, వేద పారాయణం, అంకురార్పణ, హోమం, తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. దేవదాయ శాఖ ఆర్‌జేసీ వేండ్ర త్రినాథరావు, డిప్యూటీ కమిషనర్ ఎం.సుజాత, నూకాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ ఈవో శ్రీధర్, దేవదాయ శాఖ జిల్లా అధికారి కేఎల్ సుధారాణి, ఆలయ ధర్మకర్తలు, తదితరులు పాల్గొన్నారు.