Share News

10న అరకులోయలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:15 PM

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈనెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు అరకులోనిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్నట్టు జిల్లా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

10న అరకులోయలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ముఖ్యఅతిథిగా హాజరుకానున్న మంత్రి సంధ్యారాణి

పాడేరురూరల్‌/అరకులోయ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈనెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు అరకులోనిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్నట్టు జిల్లా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్యఅతిఽథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఈ వేడుకల్లో ఆదివాసీ కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు గిరిజన సంక్షేమ అబివృద్ధికి సంబంధించి స్టాల్స్‌ ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Aug 07 , 2026 | 11:15 PM