Share News

12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:59 AM

ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఈనెల 12, 13 తేదీల్లో అటవీ శాఖ నగరంలో సదస్సు నిర్వహించనున్నది.

12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం

డిప్యూటీ సీఎం కె.పవన్‌కల్యాణ్‌ హాజరు

విశాఖపట్నం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి):

ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఈనెల 12, 13 తేదీల్లో అటవీ శాఖ నగరంలో సదస్సు నిర్వహించనున్నది. రాడిసిన్‌బ్లూ హోటల్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో 12వ తేదీన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్‌ పాల్గొననున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకు కుంకీ ఏనుగులు వచ్చిన నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ప్రపంచ ఏనుగుల దినోత్సవం జరుపుకోవాలని అటవీ శాఖ నిర్ణయించింది. ఈ ఏడాది ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ‘ఏనుగుల కారిడార్‌ను సురక్షితంగా ఉంచాలి...ఏనుగులను సురక్షితంగా ఉంచాలి’ థీమ్‌తో నిర్వహించనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ కూడా హాజరవుతారని సమాచారం.

Updated Date - Aug 09 , 2026 | 12:59 AM