నత్తనడకన పనులు
ABN , Publish Date - Nov 16 , 2026 | 12:48 AM
చోడవరం- వడ్డాది మధ్య మండలంలోని విజయరామరాజుపేట వద్ద తాచేరు గెడ్డపై తాత్కాలిక కాజ్వే పునరుద్ధరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వాస్తవానికి గత శుక్రవారం సాయంత్రానికే పనులు పూర్తి చేసి, వాహనాల రాకపోకలకు సిద్ధం చేస్తామని అధికారులు చెప్పారు. కానీ ఆదివారం సాయంత్రానికి కూడా ఒక కొలిక్కి రాలేదు. ఇంకా మట్టి పోస్తూనే వున్నారు. దీనిని చదును చేయడానికి రోడ్డు రోలర్ ఇంకా రాలేదు. అది వచ్చిన తరువాత పూర్తిస్థాయిలో చదును చేసిన అనంతరమే అన్ని వాహనాల రాకపోకలకు వీలవుతుంది. ప్రస్తుతానికి ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు తిరుగుతున్నాయి.
విజయరామరాజుపేట వద్ద తాచేరుపై పూర్తికాని కాజ్వే పునర్నిర్మాణం
తీవ్ర జాప్యంతో పలు మండలాల ప్రజలు ఇక్కట్లు
బుచ్చెయ్యపేట నవంబరు 15 (ఆంధ్ర జ్యోతి): చోడవరం- వడ్డాది మధ్య మండలంలోని విజయరామరాజుపేట వద్ద తాచేరు గెడ్డపై తాత్కాలిక కాజ్వే పునరుద్ధరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వాస్తవానికి గత శుక్రవారం సాయంత్రానికే పనులు పూర్తి చేసి, వాహనాల రాకపోకలకు సిద్ధం చేస్తామని అధికారులు చెప్పారు. కానీ ఆదివారం సాయంత్రానికి కూడా ఒక కొలిక్కి రాలేదు. ఇంకా మట్టి పోస్తూనే వున్నారు. దీనిని చదును చేయడానికి రోడ్డు రోలర్ ఇంకా రాలేదు. అది వచ్చిన తరువాత పూర్తిస్థాయిలో చదును చేసిన అనంతరమే అన్ని వాహనాల రాకపోకలకు వీలవుతుంది. ప్రస్తుతానికి ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు తిరుగుతున్నాయి.
గత నెల చివరి వారంలో సంభవించిన ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో తాచేరు నదికి వరద పోటెత్తడంతో విజయరామరాజుపేట వద్ద తాత్కాలిక కాజ్వే కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో అనకాపల్లి, చోడవరం వైపు నుంచి వడ్డాది, మాడుగుల, పాడేరు ప్రాంతాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయంగా చీడికాడ మండలం అప్పలరాజుపురం, కేజేపురం మీదుగా వాహనాలను మళ్లించారు. దీంతో సుమారు పది కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి రావాల్సి వస్తున్నదని ప్రజలు వాపోతున్నారు. నదిలో వరద ప్రవాహం తగ్గిన తరువాత కాజ్వే పునరుద్ధరణ పనులు చేపడతామని ఆర్అండ్బీ అధికారులు చెప్పారు. కానీ సుమారు రెండు వారాల తరువాత ఇటీవల పనులు చేపట్టారు. ఈ నెల 13వ తేదీ సాయంత్రంతో పనులు పూర్తి చేసి వాహనాల రాకపోకలకు అనుమతిస్తామని చెప్పారు. కానీ 15వ తేదీ వచ్చినా.. కాజ్వే పునరుద్ధరణ కాలేదు. తొలుత తాచేరు గెడ్డలో అడ్డదిడ్డంగా వున్న సిమెంటు తూములను ఎక్స్‌కవేటర్‌తో సరిచేశారు. తరువాత పాదచారులు వెళ్లడానికి అనువుగా మట్టి, ఇసుక బస్తాలువేశారు. ఆ తరువాత పనులు బాగా నెమ్మ్దదిగా సాగుతున్నాయి. ట్రాక్టర్‌తో మట్టి తీసుకువచ్చి పోసి, సరిచేస్తున్నారు. తరువాత రోడ్డు రోలర్‌తో చదును చేయాలి. ఆ తరువాతే అన్ని రకాల వాహనాలను అనుమతిస్తారు. మొత్తం పనున్నీ పూర్తికావడానికి రెండు, మూడు రోజులు పట్టే అకాశం వుంది.