Share News

పరిశ్రమల భూముల్లో పనులు మొదలు

ABN , Publish Date - Aug 05 , 2026 | 01:03 AM

మండలంలోని రాచపల్లి రెవెన్యూ 737 సర్వే నంబరులో ఎరకన్నపాలెం గ్రామ పరిధిలో పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో ఎత్తుపల్లాల చదును పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సర్వే నంబరులో మొత్తం 450 ఎకరాలను ప్రభుత్వం ఏపీఐఐసీకి అప్పగించగా, ఇందులో 150 ఎకరాలను డోజ్కో అనే ఎర్త్‌మూవర్స్‌ కంపెనీకి కేటాయించారు.

పరిశ్రమల భూముల్లో పనులు మొదలు
ఎరకన్నపాలెంలో పరిశ్రమలకు కేటాయించిన భూమిలో చెట్లను తొలగించి, చదును పనులు చేస్తున్న దృశ్యం

4ఎంకేపీ1

మాకవరపాలెం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రాచపల్లి రెవెన్యూ 737 సర్వే నంబరులో ఎరకన్నపాలెం గ్రామ పరిధిలో పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో ఎత్తుపల్లాల చదును పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సర్వే నంబరులో మొత్తం 450 ఎకరాలను ప్రభుత్వం ఏపీఐఐసీకి అప్పగించగా, ఇందులో 150 ఎకరాలను డోజ్కో అనే ఎర్త్‌మూవర్స్‌ కంపెనీకి కేటాయించారు. 24 ఎకరాలను ఎంఎస్‌ఎంపీ పార్కుకు మంజూరు చేశారు. ఈ భూముల్లో కొద్ది రోజుల నుంచి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎరకన్నపాలెం భూముల్లో నుంచి భీమబోయినపాలెం వరకు 100 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఎంఎస్‌ఎంఈ పార్కుకు కేటాయించిన భూముల్లో మామిడి, జీడిమామిడి చెట్లను తొలగించారు. ఇక్కడ యూనిట్ల ఏర్పాటుకు వివిధ పరిమాణాల్లో ప్లాట్లను రూపొందిస్తున్నారు. రహదారులు, డ్రైనేజీల నిర్మాణం కోసం భూమిని యంత్రాలతో చదును చేస్తున్నారు. డోజ్కో కంపెనీ యాజమాన్యం తనకు కేటాయించిన భూమి చుట్టూ ప్రహరీగోడ నిర్మాణానికి మార్కింగ్‌ చేశారు. కంపెనీ భూమిని అనుకొని 100 అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టారు.

Updated Date - Aug 05 , 2026 | 01:03 AM