మహిళా ఓటర్లదే పైచేయి!
ABN , Publish Date - Apr 21 , 2026 | 01:40 AM
జిల్లాలోని గ్రామ పంచాయతీల ఓటర్లలో మహిళలదే పైచేయిగా వుంది.
పురుషులకన్నా 30,504 మంది అధికం
646 పంచాయతీల్లో 12,35,083 మంది ఓటర్లు
మహిళలు... 6,32,785, పురుషులు 6,02,281
ఓటరు జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ
అనకాపల్లి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని గ్రామ పంచాయతీల ఓటర్లలో మహిళలదే పైచేయిగా వుంది. రానున్న పంచాయతీ ఎన్నికల కోసం రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే పురుషుల కంటే సుమారు 35 వేల మంది మహిళలు అధికంగా వున్నారు. ఓటరు జాబితాలను ఇటీవల గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించారు. వీటిల్లో అభ్యంతరాలు ఏమైనా ఉంటే నిర్ణీత గడువులోగా సంబంధిత పంచాయతీల కార్యదర్శులకు లిఖత రూపంలో అందజేయాల్సి వుంటుంది. జిల్లాలో ప్రస్తుతం 646 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 12,35,083 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 6,32,785 మంది మహిళలు, 6,02,281 మంది పురుషులు ఉన్నారు. మిగిలిన వారు ఇతరులు. మొత్తం మీద పురుషుల కంటే మహిళా ఓటర్లు 30,504 అధికంగా వుండడం విశేషం.
మండలాల వారీగా పంచాయతీ ఓటర్లు
మండలం మొత్తం పురుషులు మహిళలు ఇతరులు
అనకాపల్లి 81,568 39,434 42,132 2
కశింకోట 56,589 27,212 29,376 1
చోడవరం 72,986 35,630 37,353 3
రోలుగుంట 37,950 18,196 19,751 3
రావికమతం 56,004 27,149 28,855
బుచ్చెయ్యపేట 52,238 25,480 26,754 4
మాకవరపాలెం 46,985 22,875 24,110
ఎలమంచిలి 20,422 9,819 10,603
మునగపాక 45,716 22,475 23,241
గొలుగొండ 41,612 21,359 20,253
నక్కపల్లి 66,206 32,875 33,331
నాతవరం 51,777 25,358 26,407 2
ఎస్.రాయవరం 62,032 29,944 మంది, మహిళలు 32,086 2
కె.కోటపాడు 49,338 24,092 25,246
పరవాడ 44,926 22,103 22,822 1
పాయకరావుపేట 79,851 39,674 40,177
సబ్బవరం 54,337 26,514 27,822 1
మాడుగుల 56,538 27,473 29,064 1
చీడికాడ 36,784 18,888 17,896
కె.కోటపాడు 49,339 24,092 25,246 1
కేంద్రీయ విద్యాలయంలో తరగతులు ప్రారంభం
అనకాపల్లి టౌన్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఉడ్‌పేట జీవీఎంసీ పాఠశాలలో తాత్కాలిక వసతిలో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయం తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా విద్యా శాఖాధికారి అప్పారావునాయుడు తొలుత సరస్వతీదేవి విగ్రహానికి పూజలు చేసి అనంతరం చిన్నారులతో కలిసి తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒకటో తరగతి విద్యార్థులకు బుక్‌లెట్‌లు, పెన్సిల్ కిట్లు, అల్పాహారాన్ని డీఈవో అందజేశారు. కేంద్రీయ విద్యాలయాల ప్రత్యేకత, ఒత్తిడి లేని విద్యావిధానం గురించి మాట్లాడారు. సమాజానికి ఎంతో అవసరమైన నైతిక విలువలు, మంచి ప్రవర్తన కలిగిన ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడమే కేంద్రీయ విద్యాలయాల లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయాల్లో వివిధ వివిధ భాషలు, సంస్కృతులు, సామాజిక నేపథ్యాలు కలిగిన పిల్లలు కలిసి చదువుకుంటారని తద్వారా ఇవి జాతీయ సమైక్యతకు వారధులుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గౌరీశంకర్, ఉపాధ్యాయులు తేజేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, ప్రధానకార్యదర్శి బొడ్డేడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.