Share News

మహిళా ఓటర్లే కీలకం

ABN , Publish Date - Oct 22 , 2026 | 01:33 AM

జీవీఎంసీ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. మొత్తం ఓటర్లలో సగానికిపైగా మహిళా ఓటర్లే ఉన్నారు. జీవీఎంసీ పరిధిలోని 120 వార్డుల్లో మొత్తం 18,37,901 మంది ఓటర్లు ఉండగా అందులో మహిళలు 9,30,916 మంది కాగా పురుషులు 9,06,866 మంది, ఇతరులు 119 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు సుమారు 24 వేల మంది ఎక్కువగా ఉన్నారు.

మహిళా ఓటర్లే కీలకం

జీవీఎంసీ పరిధిలో మొత్తం 18,37,901 మంది ఓటర్లు

మహిళలు 9,30,916 మంది

పురుషులు 9,06,866

91 వార్డుల్లో అతివల ఆధిపత్యం

విశాఖపట్నం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. మొత్తం ఓటర్లలో సగానికిపైగా మహిళా ఓటర్లే ఉన్నారు. జీవీఎంసీ పరిధిలోని 120 వార్డుల్లో మొత్తం 18,37,901 మంది ఓటర్లు ఉండగా అందులో మహిళలు 9,30,916 మంది కాగా పురుషులు 9,06,866 మంది, ఇతరులు 119 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు సుమారు 24 వేల మంది ఎక్కువగా ఉన్నారు.

జోన్‌ల వారీగా పరిశీలిస్తే భీమిలి జోన్‌లో 66,446 ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 32,257 మంది, మహిళలు 34,186 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు. మధురవాడ జోన్‌ పరిధిలో 1,49,452 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 73,451 మంది, మహిళలు 75,989 మంది, ఇతరులు 12 మంది ఉన్నారు. ఈస్ట్‌ జోన్‌ పరిధిలో 2,96,124 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 1,45,280 మంది, మహిళలు 1,50,823 మంది, ఇతరులు 21 మంది ఉన్నారు. సౌత్‌ జోన్‌ పరిధిలో 2,17,817 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 1,06,867 మంది, మహిళలు 1,10,917 మంది, ఇతరులు 33 మంది ఉన్నారు. నార్త్‌ జోన్‌ పరిధిలో 2,91,691 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 1,43,642 మంది మహిళలు 1,48,026 మంది, ఇతరులు 23 మంది ఉన్నారు. వెస్ట్‌ జోన్‌ పరిధిలో 2,22,029 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 1,09,248 మంది, మహిళలు 1,12,770 మంది, ఇతరులు 11 మంది ఉన్నారు. అగనంపూడి జోన్‌ పరిధిలో 69,796 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 35,110 మంది, మహిళలు 34,685 మంది ఇతరులు ఒకరు ఉన్నారు. అనకాపల్లి జోన్‌ పరిధిలో 76,950 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషులు 37,079 మంది, మహిళలు 39,869 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. పెందుర్తి జోన్‌ పరిధిలో 1,49,367 మంది ఓటర్లు ఉండగా వారిలో 74,770 మంది పురుషులు, 74,595 మంది మహిళలు, ఇతరులు ఇద్దరు ఉన్నారు. జీవీఎంసీ పరిధిలోని పది జోన్‌లలో అగనంపూడి, పెందుర్తి జోన్‌లలో మాత్రమే పురుష ఓటర్లు స్వల్పంగా అధికంగా ఉంటే, మిగిలిన ఎనిమిది జోన్‌ల పరిధిలోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఇక వార్డులవారీగా పరిశీలిస్తే 120 వార్డుల్లో కేవలం 29 వార్డుల్లో మాత్రమే పురుష ఓటర్లు అధికంగా ఉండగా, మిగిలిన 91 వార్డుల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.

Updated Date - Oct 22 , 2026 | 01:33 AM