మహిళా ఓటర్లే అధికం
ABN , Publish Date - Apr 16 , 2026 | 10:59 PM
జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా బుధవారం పంచాయతీల్లో ఓటరు జాబితాలను ప్రదర్శించిన నేపథ్యంలో జిల్లా, మండల, పంచాయతీల వారీగా ఉన్న ఓటర్ల వివరాలు బహిర్గతమయ్యాయి.
జిల్లాలో పురుషుల కంటే 15,550 మంది ఎక్కువ
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా బుధవారం పంచాయతీల్లో ఓటరు జాబితాలను ప్రదర్శించిన నేపథ్యంలో జిల్లా, మండల, పంచాయతీల వారీగా ఉన్న ఓటర్ల వివరాలు బహిర్గతమయ్యాయి. దీంతో జిల్లాలోని 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 4 లక్షల 98 వేల 467 మంది ఓటర్లు కాగా, వారిలో పురుషులు: 2,41,447, మహిళలు: 2,56,997, ఇతరులు: 23 మంది ఉన్నారు. అంటే పురుషుల కంటే మహిళా ఓటర్లు 15,550 మంది అధికంగా ఉండడం విశేషం. అలాగే జిల్లాలోని అన్ని మండలాల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని జాబితాల ప్రదర్శన ద్వారా నిర్ధారణ అయింది. పలు సందర్భాల్లో కొన్ని మండలాల్లో పురుషులు అధికంగా ఉండగా, మరికొన్ని మండలాల్లో మహిళలు ఎక్కువగా ఉంటారు. కానీ అందుకు భిన్నంగా జిల్లాలోని మొత్తం పదకొండు మండలాల్లోనూ పరుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు.