మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
ABN , Publish Date - May 05 , 2026 | 11:29 PM
డ్వాక్రా సంఘాల సభ్యులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, బ్యాంకులు ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనీ డీఆర్‌డీఏ పీడీ శచీదేవి సూచించారు.
డీఆర్‌డీఏ పీడీ శచీదేవి
నక్కపల్లి, మే5 (ఆంధ్రజ్యోతి): డ్వాక్రా సంఘాల సభ్యులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, బ్యాంకులు ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనీ డీఆర్‌డీఏ పీడీ శచీదేవి సూచించారు. మండలంలోని సీహెచ్‌బీ అగ్రహారంలో మంగళవారం డ్వాక్రా మహిళలకు జీవనోపాధి ప్రణాళికల రూపకల్పనపై అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, తీసుకున్న రుణాలతో వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు. నక్కపల్లి మండలంలో భవిష్యత్తులో పలు పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, వీటిల్లో క్యాంటీన్ల నిర్వహణకు మహిళా సంఘాల సభ్యులు బృందంగా ఏర్పాటు కావాలన్నారు. వీరికి రుణ సదుపాయం అందించి, క్యాంటీన్ నిర్వహణలో శిక్షణ కూడా ఇస్తామని చెప్పారు. సేంద్రీయ పద్ధతిలో పంటలు పండించాలని, చిరుధాన్యాలతో రకరకాల పిండి వంటలు తయారు చేసి విక్రయించడం ద్వారా ఆదాయం పొందచవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాస్, సీసీ రాజు, వీవోఏ శ్రీదేవి పాల్గొన్నారు.