Share News

వయోభారాన్ని సైతం లెక్కచేయకుండా..

ABN , Publish Date - Nov 06 , 2026 | 01:16 AM

ఆమె స్వాతంత్య్ర సమరయోధురాలు.. పైగా శతాధిక వృద్ధురాలు. వయో భారాన్ని సైతం లెక్కచేయకుండా 110 సంవత్సరాలు వయస్సులో కూడా పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ప్రజాస్వామ్యం పట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నారు.

వయోభారాన్ని సైతం లెక్కచేయకుండా..
దిమిల్సిలో ఓటు వేసిన స్వాతంత్య్ర సమరయోధురాలు డబ్బీరు ఆదిలక్ష్మి

ఓటు హక్కు వినియోగించుకున్న శతాధిక స్వాతంత్య్ర సమరయోధురాలు

రాంబిల్లి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఆమె స్వాతంత్య్ర సమరయోధురాలు.. పైగా శతాధిక వృద్ధురాలు. వయో భారాన్ని సైతం లెక్కచేయకుండా 110 సంవత్సరాలు వయస్సులో కూడా పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ప్రజాస్వామ్యం పట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నారు. మండలంలోని దిమిలి గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధురాలు డబ్బీరు ఆదిలక్ష్మి గురువారం ఎవరి సాయం లేకుండానే స్థానిక పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తనకు ఓటు హక్కు వచ్చిన తరువాత నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ఓటు వేసినట్టు చెప్పారు.

Updated Date - Nov 06 , 2026 | 01:16 AM