Share News

అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా..

ABN , Publish Date - Mar 12 , 2026 | 01:23 AM

ప్రజల గొంతుకగా వారి సమస్యలను ఎప్పటికప్పుడు ఎలుగెత్తి చూపుతున్న ‘ఆంధ్రజ్యోతి’... ఆ సమస్యల పరిష్కారానికి ఆచరణీయ పద్ధతిలో ముందుకు కదులుతోంది.

అక్షరం అండగా..  పరిష్కారమే అజెండాగా..

ప్రజల వద్దకే ప్రజా ప్రతినిధులు, అధికారులు

తమ సమస్యలను నేరుగా వారి దృష్టికి తీసుకువెళ్లే అవకాశం

నేడు అచ్యుతాపురం మండలం దిబ్బపాలెంలో కార్యక్రమం

సమయం: ఉదయం 10 గంటలు

వేదిక : దిబ్బపాలెం పంచాయతీ కార్యాలయం

అచ్యుతాపురం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):

ప్రజల గొంతుకగా వారి సమస్యలను ఎప్పటికప్పుడు ఎలుగెత్తి చూపుతున్న ‘ఆంధ్రజ్యోతి’... ఆ సమస్యల పరిష్కారానికి ఆచరణీయ పద్ధతిలో ముందుకు కదులుతోంది. ఇందులో భాగంగా అధికారులు-ప్రజాప్రతినిధులు, ప్రజలకు మధ్య వారధిగా గురువారం అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం పంచాయతీలో ‘అక్షరం అండగా, పరిష్కారమే అజెండాగా...’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ‘సెజ్‌’ పునరావాస కాలనీ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ బైలపూడి శ్రీరామదాసు పర్యవేక్షణలో పంచాయతీ కార్యాలయంలో ఉదయం పది గంటలకు ప్రారంభం అయ్యే ఈ కార్యక్రమానికి ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌, సర్పంచ్‌ డి.శాంతికుమారి, ఎంపీటీసీ సభ్యులు అడిగర్ల శ్రీనివాసరావు, నీరుకొండ నరసింగరావు, లాలం శ్రీనివాసరావు, ఏపీఐఐసీ డీజీఎం సూర్యనారాయణమూర్తి, ఎంపీడీఓ చిన్నారావు, డిప్యూటీ తహశీల్దారు శ్యామ్‌కుమార్‌, ఈపీడీసీఎల్‌ ఏఈ శ్రీనివాసరావు, సీఐ ఆర్‌వీవీఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌, తదితరులు హాజరుకానున్నారు. పంచాయతీ ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను నేరుగా అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.

Updated Date - Mar 12 , 2026 | 01:23 AM