Share News

అప్పన్న ఆశీస్సులతో అందరికీ ఆమోదయోగ్యమైన పాలన

ABN , Publish Date - Apr 02 , 2026 | 01:24 AM

వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆశీస్సులతో అందరికీ ఆమోదయోగ్యమైన పరిపాలన అందించేందుకు కృషిచేస్తానని జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ అన్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు ముందు ఆయన బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి సింహాద్రినాథుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి పుణ్యస్థలిలో పనిచేయడం ప్రతి అధికారికి సువర్ణ అవకాశం, అదృష్టమన్నారు. దేవుడి ఆశీస్సులతో ప్రజలకు ప్రయోజనకరమైన పనులు చేపట్టడంతోపాటు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేందుకు కృషిచేస్తానన్నారు.

అప్పన్న ఆశీస్సులతో  అందరికీ ఆమోదయోగ్యమైన పాలన

నూతన కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌

సింహాచలం, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి):

వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆశీస్సులతో అందరికీ ఆమోదయోగ్యమైన పరిపాలన అందించేందుకు కృషిచేస్తానని జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ అన్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు ముందు ఆయన బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి సింహాద్రినాథుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి పుణ్యస్థలిలో పనిచేయడం ప్రతి అధికారికి సువర్ణ అవకాశం, అదృష్టమన్నారు. దేవుడి ఆశీస్సులతో ప్రజలకు ప్రయోజనకరమైన పనులు చేపట్టడంతోపాటు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేందుకు కృషిచేస్తానన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన కలెక్టర్‌కు దేవస్థానం ఈఓ జల్లెపల్లి వెంకటరావు, అర్చకులతో కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. కలెక్టర్‌ గోత్రనామాలతో అంతరాలయంలో అర్చకులు పూజలు చేసి శేషవస్త్రాన్ని పర్యవేట్టంగా చుట్టారు. కప్పస్తంభ ఆలింగనం, గోదాదేవి అమ్మవారి దర్శనం తరువాత పండితులు వేదాశీర్వచనాలీయగా, ఈఓ శాలువాతో సత్కరించి జ్ఞాపికగా స్వామివారి ఫొటోను, ప్రసాదాలను, వార్షిక తిరుకల్యాణోత్సవ అక్షితలను అందజేశారు.

Updated Date - Apr 02 , 2026 | 01:24 AM