భూ విలువలు భారీగా పెంపు?
ABN , Publish Date - Jan 27 , 2026 | 01:28 AM
నగర శివార్లలో భూముల విలువలు భారీగా పెరగనున్నాయి.
ఐటీ సెజ్ ఏరియాలో 35 శాతం పెంపునకు ప్రతిపాదన
మధురవాడలో 20 నుంచి 30 శాతం
సిటీలో పది శాతం కంటే తక్కువ
రిజిస్ర్టేషన్‌ల శాఖ వెబసెట్, సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో వివరాలు
29వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకారం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగర శివార్లలో భూముల విలువలు భారీగా పెరగనున్నాయి. కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి సంస్థలు రావడం, వాటికి ఐటీ సెజ్ పరిసరాల్లో భూములు కేటాయించడంతో ఆయా ప్రాంతాల్లో అత్యధికంగా 35 శాతం వరకూ ధరలు పెంచుతామని అధికారులు ప్రతిపాదించారు. ముఖ్యంగా మధురవాడ, ఐటీ సెజ్ ప్రాంతాల్లో భూముల ధరలు పెంచబోతున్నారు. విశాఖ నగరంలో ఇప్పటికే ధరలు అధికంగా ఉండడంతో పది శాతం కంటే తక్కువగానే పెంపునకు సబ్ రిజిస్ట్రార్లు ప్రతిపాదించారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటవుతున్న ఆనందపురం మండలంలో భూముల ధరలు పెంచబోవడం లేదు. వాస్తవానికి గూగుల్ ప్రకటన తరువాత ఆనందపురంతో పాటు తర్లువాడ, తంగేడుబిల్లి, రామవరం, పాలవలస ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి. ఆ ప్రకారం ఇప్పుడు విలువు పెంచాల్సి ఉంది. కానీ జిల్లా రెవెన్యూ అధికారులు ఈ ప్రతిపాదనలకు అడ్డం పడినట్టు తెలిసింది. అందుకే మార్కెట్ విలువల పెంపు జాబితాలో తర్లువాడ, తంగేడుబిల్లి, పాలవలస, రామవరం గ్రామాల పేర్లు లేవు.
- కొమ్మాది జంక్షన్‌లో గజం రూ.54 వేలు ఉండగా, మార్కెట్ రేటు రూ.80 వేలు చెబుతున్నారు. ప్రభుత్వం 33 శాతం పెంచి రూ.66,500 చేస్తున్నారు.
- సైబర్ వేలీలో ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ధర గజానికి రూ.42 వేలు ఉండగా, మార్కెట్ రేటు రూ.70 వేలు ఉంది. దీంతో ప్రభుత్వ ధరను రూ.56,500కు ప్రతిపాదించారు. అంటే 35 శాతం పెంచినట్టు లెక్క. అదేవిధంగా ఆ పక్కనే ఉన్న సినీ పోలీస్, నార్త్‌స్టార్, ది అడ్రస్...తదితర ప్రాంతాల్లోను ఇదేవిధంగా 35 శాతం పెంపునకు ప్రతిపాదించారు.
- మధురవాడ జంక్షన్‌లో రిజిస్ట్రేషన్ ధర గజం రూ.54 వేలు ఉండగా మార్కెట్ రేటు రూ.90 వేలు పలుకుతోంది. ప్రభుత్వం కొత్త రేటు రూ.66,500 కు ప్రతిపాదించింది. అంటే 33 శాతం పెంచారు.
- కొమ్మాది జంక్షన్‌లో గజం రూ.54 వేలు ఉండగా, మార్కెట్ రేటు రూ.80 వేలు చెబుతున్నారు. ప్రభుత్వం 33 శాతం పెంచి రూ.66,500 చేస్తున్నారు.
- సాయిప్రియ లేఅవుట్‌లో గజం రూ.37 వేలు ఉండగా బయట రూ.60 వేలు పలుకుతోంది. దాంతో 20 శాతం పెంచి రూ.44,500 చేస్తున్నారు.
- కొమ్మాది సమీపాన ఎంవీవీ-జీవీ ది గ్రాండ్ ఏరియాలో గజం రూ.44 వేలు ఉండగా మార్కెట్‌లో రూ.60 వేలు పలుకుతోంది. దాంతో గజం రూ.46,500 చేశారు. అక్కడ ఫ్లాట్ల ధరలు చ.అడుగు రూ.3,600 నుంచి రూ.3,800కు పెంచారు. బయట రూ.6 వేలకు అమ్ముడవుతోంది.
- పీఎం పాలెం స్టేడియం ఎదురుగా ఎంవీవీ సిటీ వద్ద గజం ధర రూ.44 వేలు ఉండగా, బయట రూ.70 వేలు ఉంది. దానిని రూ,56,500కు పెంచారు. ఫ్లాట్లు...చ.అడుగు రూ.4,200 ఉండగా రూ.4,300కు పెంచారు. బయట రూ.7 వేలు ఉంది.
- ఐటీ పార్కు ఏరియాలో గజం రూ.44 వేలు ఉండగా, దానిని రూ.56,500 చేస్తున్నారు. 28 శాతం పెంచారు.
- సిటీలోని వీఐపీ రోడ్డులో గజం రూ.90 వేలు ఉండగా మార్కెట్ రేటు రూ.1.5 లక్షలు పలుకుతోంది. దీనిని ప్రభుత్వం రూ.93 వేలు చేసింది.
- సీతమ్మధార్ నార్త్ ఎక్స్‌టెన్షన్, టీపీటీ కాలనీల్లో గతం ధర రూ.85 వేలు కాగా బయట మార్కెట్‌లో రూ.1.4 లక్షలు పలుకుతోంది. ప్రభుత్వం దీనిని ధరను రూ.87 వేలు చేస్తోంది.
- ఎంవీపీ కాలనీలోని అన్ని సెక్టార్లలో గజం రూ.75 వేలు ఉండగా బయట రూ.లక్ష పలుకుతోంది. ప్రభుత్వం రూ.78 వేలు చేసింది.
- ఈస్ట్ పాయింట్ కాలనీలో ఫ్లాట్ ధరలు రిజిస్ట్రేషన్ ధర చ.అడుగు రూ.5,300 ఉండగా బయట రూ.7,500కు అమ్ముతున్నారు. దీనిని రూ.5,500 చేశారు. ఎంవీపీ కాలనీలో ఇదే ధరలు ఉండగా అక్కడ కూడా ఇలాగే పెంచారు.
- విశాలాక్షి నగర్‌లో రిజిస్ర్టేషన్ ధర అడుగు రూ.4,500 కాగా రూ.200 పెంచారు. బయట అమ్మకం ధర రూ.7వేలు ఉంది.
- బీచ్ రోడ్డులో రిజిస్ర్టేషన్ ధర చదరపు అడుగు రూ.6 వేలు కాగా రూ.200 పెంచారు. బయట రేటు రూ.7,500 ఉంది.
29 వరకు అభ్యంతరాలు
ఈ వివరాలన్నీ రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌తో పాటు ఆయా ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్కడి అధికారులకు తెలియజేయవచ్చు. ఈ నెల 29వ తేదీ వరకు సమయం ఉంది. ఆ తరువాత వాటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారు. కొత్త ధరలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తాయి.
- సైబర్ వేలీలో ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ధర గజానికి రూ.42 వేలు ఉండగా, మార్కెట్ రేటు రూ.70 వేలు ఉంది. దీంతో ప్రభుత్వ ధరను రూ.56,500కు ప్రతిపాదించారు. అంటే 35 శాతం పెంచినట్టు లెక్క. అదేవిధంగా ఆ పక్కనే ఉన్న సినీ పోలీస్, నార్త్‌స్టార్, ది అడ్రస్...తదితర ప్రాంతాల్లోను ఇదేవిధంగా 35 శాతం పెంపునకు ప్రతిపాదించారు.
- మధురవాడ జంక్షన్‌లో రిజిస్ట్రేషన్ ధర గజం రూ.54 వేలు ఉండగా మార్కెట్ రేటు రూ.90 వేలు పలుకుతోంది. ప్రభుత్వం కొత్త రేటు రూ.66,500 కు ప్రతిపాదించింది. అంటే 33 శాతం పెంచారు.