పినకోటలో అడవిదున్నల సంచారం
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:05 AM
మండలంలోని పినకోట పంచాయతీ సమీపంలో అడవిదున్నలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. చింతపాక, బొర్రాపాలెం, పినకోట సమీపంలో అధిక సంఖ్యలో అడవిదున్నలు తిరుగుతున్నాయని స్థానిక గిరిజనులు సోమవారం విలేకరులకు తెలిపారు.
భీతిల్లుతున్న జనం
అనంతగిరి, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పినకోట పంచాయతీ సమీపంలో అడవిదున్నలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. చింతపాక, బొర్రాపాలెం, పినకోట సమీపంలో అధిక సంఖ్యలో అడవిదున్నలు తిరుగుతున్నాయని స్థానిక గిరిజనులు సోమవారం విలేకరులకు తెలిపారు. అడవిదున్నలు కొమ్ములతో జీడితోటలను నాశనం చేస్తున్నాయని, వలిసెలను పాడుచేస్తున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా అడవిదున్నలు భయాందోళనకు గురిచేసినా అటవీ అధికారులు స్పందించలేదని వారు తెలిపారు. అడవిదున్నల కారణంగా కొండ ప్రాంతాలకు వెళ్లేందుకు గిరిజనులు సాహసించడం లేదని, ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.