Share News

ఆయుష్‌ ఆస్పత్రికి మెక్షమెన్నడో?

ABN , Publish Date - Jul 13 , 2026 | 12:46 AM

ఆయుర్వేద, యునాని, ప్రకృతి వైద్యం మరింత చేరువ చేసేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆయుష్‌ ఇంటిగ్రేటెడ్‌ ఆస్పత్రి, యోగా అండ్‌ నేచు రోపతి మెడికల్‌ కాలేజీ ఎప్పటికి అందుబాటులోకి వస్తా యో స్పష్టత కొరవడింది.

ఆయుష్‌ ఆస్పత్రికి మెక్షమెన్నడో?

యోగా, నేచురోపతి మెడికల్‌ కాలేజీదీ అదే పరిస్థితి

విమ్స్‌ ప్రాంగణంలో రూ.31 కోట్లతో భవన నిర్మాణాలు

ఏడాది గడిచినా లభించని మోక్షం

అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర వాసులకు మేలు

ప్రారంభోత్సవంపై స్పష్టత లేదంటున్న అధికారులు

విశాఖపట్నం, జూలై 12 (ఆంధ్రజ్యోతి):

ఆయుర్వేద, యునాని, ప్రకృతి వైద్యం మరింత చేరువ చేసేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆయుష్‌ ఇంటిగ్రేటెడ్‌ ఆస్పత్రి, యోగా అండ్‌ నేచు రోపతి మెడికల్‌ కాలేజీ ఎప్పటికి అందుబాటులోకి వస్తా యో స్పష్టత కొరవడింది. వీటికోసం సుమారు రూ.31 కోట్లు వెచ్చించి విమ్స్‌ ప్రాంగణంలో అధునాతన భవనా ల నిర్మాణం పూర్తై ఏడాది గడుస్తున్నా అందుబాటులోకి తేవవడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌ (నామ్‌)లో భాగంగా దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆయుష్‌ ఇంటిగ్రేటెడ్‌ ఆస్పత్రి, యోగా అండ్‌ నేచరోపతి మెడికల్‌ కాలేజీలను మంజూరుచేసింది. రాష్ట్రానికి మంజూరైన ఆస్పత్రి, మెడి కల్‌ కాలేజీలను హనుమంతువాక దగ్గరలోని విమ్స్‌ ప్రాం గణంలో ఏర్పాటుచేసేందుకు సంకల్పించి భారీ విస్తీర్ణంలో భవనాలను నిర్మించారు. ఆయుష్‌ ఇంటిగ్రేటెడ్‌ ఆస్పత్రి భవనాన్ని జీ ప్లస్‌ 2 విధానంలో రూ.16 కోట్లు వెచ్చించి, మెడికల్‌ కాలేజీకి రూ.14 కోట్లు వెచ్చించి భవనాలు నిర్మిం చారు. ఏడాది గడుస్తున్నా అందుబాటులోకి తేవడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. దీంతో భవనాలు వృథా గా మారాయి. ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరం నుంచి యోగా అండ్‌ నేచురోపతి మెడికల్‌ కాలేజీలో 50 సీట్లతో ప్రవేశాలు ప్రారంభించేందుకు అనుగుణంగా ఏర్పా ట్లు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని గతంలో ఆరోగ్యశాఖా మంత్రి కూడా ప్రకటించారు. ఈ విద్యా సం వత్సరం ప్రారంభమై వారాలు గడుస్తున్నా ఈ కాలేజీలో ప్రవేశాలపై స్పష్టత లేదు. బ్యాచిలర్‌ ఆఫ్‌ నేచురోపతి అండ్‌ యోగిక్‌ సైన్సెస్‌ (బీఎన్‌వైఎస్‌) కోర్సులను 50 సీట్ల తో ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులకు యోగా థెరపీ, ప్రకృతి వై ద్యం,పోషకాహార శాస్త్రం, ఫిజియోథెరపీ మౌలిక అంశాలు, జీవనశైలి వ్యాధుల నిర్వహణ, క్లినికల్‌ శిక్షణ ఇస్తారు. కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు బీఎన్‌వైఎస్‌ వైద్యుడిగా ప్రాక్టీస్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది.

ప్రకృతి వెద్యానికి అవకాశం..

కళాశాలకు అనుబంధంగా 50 పడకలతో ఇంటిగ్రేటెడ్‌ ఆయుష్‌ ఆస్పత్రిని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దీని వల్ల ఎంతో మంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అం దించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతు న్నారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే ఆయుర్వేద, యునాని, హోమియోపతి వంటి ప్రకృతి సేవలు అందు తాయి. ఈ వైద్యశాలలో పది మంది వైద్యులు, 20 మంది సిబ్బంది అందుబాటులోకి వస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే రోగులను ఇన్‌పేషెంట్లుగా చేర్చు కుని వైద్యసేవలు అందించే అవకాశం ఉంది. ఆస్పత్రి, మెడికల్‌ కాలేజీ ప్రారంభోత్సవంపై స్పష్టత లేదని అధికారులే చెబుతుండడం విశేషం. దీనిపై ఆయుష్‌ అధికారు లకు కూడా కనీస సమాచారం లేకపోవడం గమనార్హం.

Updated Date - Jul 13 , 2026 | 12:46 AM