Share News

నిరుపయోగంగా సంపద కేంద్రాలు

ABN , Publish Date - Jun 16 , 2026 | 10:54 PM

మండలంలో లక్షలాది రూపాయలతో నిర్మించిన చెత్త నుంచి సంపద కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. వీటి పర్యవేక్షణపై అధికారులు దృష్టి సారించకపోవడంతో వృథాగా పడి ఉన్నాయి.

నిరుపయోగంగా సంపద కేంద్రాలు
గన్నెలలో నిరుపయోగంగా ఉన్న చెత్త నుంచి సంపద కేంద్రం .

రూ.లక్షలు ఖర్చు చేసినా నెరవేరని లక్ష్యం

అరకులోయ, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): మండలంలో లక్షలాది రూపాయలతో నిర్మించిన చెత్త నుంచి సంపద కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. వీటి పర్యవేక్షణపై అధికారులు దృష్టి సారించకపోవడంతో వృథాగా పడి ఉన్నాయి. వాస్తవానికి గ్రామాల్లో రోజూ తడి, పొడి చెత్తను పారిశుధ్య కార్మికులు సేకరించి చెత్త నుంచి సంపద కేంద్రాలకు తరలించాల్సి ఉంది. అయితే పంచాయతీ కార్యదర్శులు సైతం పర్యవేక్షించకపోవడంతో సంపద కేంద్రాలకు చెత్త వెళ్లడం లేదు. మండలంలో పెదలబుడు, పద్మాపురం మేజర్‌ గ్రామ పంచాయతీల్లో మాత్రమే పారిశుధ్య కార్మికులు చెత్తను సంపద కేంద్రాలకు తరలిస్తున్నారు. మిగతా పంచాయతీల్లో మచ్చుకైనా చెత్త సేకరణ జరగడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో ఎక్కడపడితే అక్కడ చెత్త దర్శనమిస్తోంది. లక్షలాది రూపాయలతో చెత్త నుంచి సంపద కేంద్రాలను నిర్మించినా అవి మాత్రం వినియోగంలో లేక వృథాగా పడి ఉన్నాయి.

Updated Date - Jun 16 , 2026 | 10:54 PM