Share News

ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయాలు చేస్తే సహించబోం

ABN , Publish Date - Jun 18 , 2026 | 11:07 PM

జిల్లాలో ఉద్యోగులు రాజకీయాలు చేస్తే సహించబోమని టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి హెచ్చరించారు.

ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయాలు చేస్తే సహించబోం
మాట్లాడుతున్న గిడ్డి ఈశ్వరి

టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి

పాడేరురూరల్‌, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉద్యోగులు రాజకీయాలు చేస్తే సహించబోమని టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి హెచ్చరించారు. గురువారం స్థానిక వీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సంబరాల్లో ఆమె మాట్లాడుతూ జిల్లా స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు చాలా మంది ఉద్యోగులు ఇంకా రాజకీయ పార్టీల ముసుగులో పనిచేస్తున్నారని, ఇది సహించబోమని హెచ్చరించారు. ఉద్యోగులకు రాజకీయాలతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా సేవలు అందించాలన్నారు. ఇంకా వైసీపీ భావజాలాన్ని వీడకుండా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో వారందరిపైన చర్యలు తీసుకుంటామన్నారు. గత వైసీపీ పాలనలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో వాక్‌ స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తుంటే కొందరు ఉద్యోగులు వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్నారన్నారు. అది సరైన పద్ధతి కాదని, ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

Updated Date - Jun 18 , 2026 | 11:07 PM