నిలిచిపోయిన టూరిజం ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:44 PM
అర్ధంతరంగా నిలిచిపోయిన పర్యాటక ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ తెలిపారు.
ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ
అరకులోయ, జనవరి 29(ఆంధ్రజ్యోతి): అర్ధంతరంగా నిలిచిపోయిన పర్యాటక ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ తెలిపారు. అరకు ఉత్సవ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు అర్ధంతరంగా నిలిచిపోయిన ప్రాజెక్టుల వివరాలను ‘ఆంధ్రజ్యోతి’ తెలియజేసింది. హరితవేలీ రిసార్టు ప్రాంగణంలోని డ్రైవ్ ఇన్ రెస్టారెంట్, కొత్తవలస హెచ్‌ఎన్‌టీసీ ఫాంలో ఈట్‌స్ట్రీట్- ట్రైబల్‌హట్, తదితర ప్రాజెక్టుల గురించి వివరించడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయా ప్రాజెక్టులను టూరిజం జీఎం నాంచారయ్య, అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. కార్పొరేషన్‌కు ఆదాయం, స్థానిక గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.