Share News

అనకాపల్లిని సుందరంగా తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - Jan 13 , 2026 | 02:04 AM

అనకాపల్లి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని జీవీఎంసీ మేయర్‌ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.

అనకాపల్లిని సుందరంగా తీర్చిదిద్దుతాం

మేయర్‌ పీలా, ఎమ్మెల్యే కొణతాల

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

అనకాపల్లి టౌన్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి):

అనకాపల్లి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని జీవీఎంసీ మేయర్‌ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం జీవీఎంసీ పరిధిలోని 82, 83, 84 వార్డుల్లో కోట్లాది రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖనగరంతోపాటు అనకాపల్లి పట్టణాన్ని కూడా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా గాంధీనగరంలోని పార్కును పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పీలా గోవింద సత్యనారాయణ, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ మళ్ల సురేంద్ర, స్థానిక కార్పొరేటర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 02:04 AM