Share News

మండు వేసవిలో జలకళ

ABN , Publish Date - May 01 , 2026 | 11:10 PM

కూటమి ప్రభుత్వం జలసంరక్షణ చర్యలతో మండు వేసవిలో లుబ్బుర్తి జలాశయంలో జలకళ సంతరించుకుంది.

మండు వేసవిలో జలకళ
మండు వేసవిలో నిండుకుండలా ఉన్న లుబ్బుర్తి జలాశయం

నిండుకుండలా లుబ్బర్తి జలాశయం

కొయ్యూరు, మే 1 (ఆంధ్రజ్యోతి) కూటమి ప్రభుత్వం జలసంరక్షణ చర్యలతో మండు వేసవిలో లుబ్బుర్తి జలాశయంలో జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో కూడా జలాశయం నిండుకుండలా దర్శినమిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొర్లుకట్ట, గట్లు పటిష్టం చేయడంతోపాటు స్లూయిస్‌కు నీరు వెళ్లే అక్విడెక్టులు మరమ్మతులు చేశారు. దీంతో వర్షాకాలంలో పడిన వర్షపు నీరు వృథా కాలేదు. అంతేకాకుండా జలాశయంలో చేపలు పెంపకం చేపట్టారు. ఈ జలాశయంలో జలక్రీడలను రెవెన్యూ, పోలీసు శాఖలు నిషేధించాయి. మూడు పంచాయతీలకు చెందిన రైతులతో ఏర్పడిన సాగునీటి సంరక్షణ కమిటీ నిత్యం పహరా కాస్తుండడంతో జలాశయం నిండుగా దర్శనమిస్తోంది. మండు వేసవిలో లుబ్బుర్తి జలాశయం నిండుకుండలా ఉండడంతో రైతులు సంబరపడుతున్నారు.

Updated Date - May 01 , 2026 | 11:10 PM